జుట్టును కాపాడుకోవడానికి చాలా మంది మార్కెట్ లో దొరికే వివిధ బ్రాండ్లక చెందిన ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. వాటి కోసం విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయమేమిటంటే మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు, తప్పులే జుట్టు బలహీనంగా మారడానికి, పెరగకపోవడానికి కారణాలవుతాయి. వాటిని నివారిస్తే జుట్టు సంరక్షణకు అంత కష్టమేం కాదని నిపుణులు చెబుతున్నారు.
సమతుల్య ఆహారం తీసుకోండి
బలమైన జుట్టు కోసం అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించడానికి పండ్లు, కూరగాయలు వంటి అనేక పోషకాలున్న ఆహారంగా తీసుకోండి
అధిక వేడి స్ట్రైలింగ్స్ ను నివారించండి
కర్లింగ్ ఐరన్లు, స్ట్రైట్నర్లు వంటి సాధనాల జుట్టుకు హాని కలిగిస్తాయి. హీట్ స్ట్రైలింగ్ ను తగ్గించండి లేదా ప్రొటెక్టెంట్ స్ప్రెని ఉపయోగించండి.
బ్రష్ చేసినప్పుడు సున్నితంగా చేయండి
జుట్టు చివరి నుండి ప్రారంభం వరకు పెద్ద ముళ్ళతో కూడిన బ్రష్ ను ఉపయోగించండి.
క్రమం తప్పకుండా కత్తిరించండి
రెగ్యులర్ ట్రిమ్ లు స్పిట్లను ఎప్పటికప్పుడు వదిలించుకోండి. ఇవి జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి.
సూర్యుని నుంచి రక్షించుకోండి
సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు జుట్టు ను దెబ్బతీస్తాయి. దీని వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. ఎండలో గడపాల్సి వచ్చినపుడు హానికరమైన కిరణాలు నుంచి రక్షణగా తలపై టోపీని ధరించండి.
సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి
సల్ఫేట్ జుట్టులోని నూనెలను తీసివేసి పొడిగా ఉంచుతుంది. జుట్టు సున్నితంగా ఉండే సల్ఫేట్ లేని శాంపులను ఎంపిక చేసుకోండి.
డీప్ కండిషనింగ్ క్రమం తప్పకుండా
వారానికి ఒకసారి జుట్టును డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్లతో చికిత్స చేయండి. ఈ చికిత్సలు జుట్టుకు బలాన్ని అందిస్తాయి.
బిగుతుగా ఉండే కేశాలంకరణకు దూరంగా ఉండండి
బిగుతుగా ఉండే పోనీటెయిల్ జడలు, నిరంతరం లాగడం వల్ల జుట్టులో ఒత్తిడి ఏర్పడి క్రమంగా పగుళ్ళు ఏర్పడుతాయి.
రసాయన చికిత్సల పట్ల జాగ్రత్త వహించండి
కలరింగ్, పెర్మింగ్ లాంటి రిలాక్సింగ్ రసాయన చికిత్సలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు బలహీన పడుతుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి సరైన సూచనలను పాటించండి.
హైడ్రెటెడ్ గా ఉండండి
జుట్టి ఆరోగ్యంగా ఉండడానికి హైడ్రేషన్ ముఖ్యం. జుట్టు, శరీరం హైడ్రేట్ గా ఉంచడానికి ఎక్కువ నీరు తాగండి. దీని వల్ల పొడి జుట్టు విరిగిపోయే
అవకాశం తక్కువ ఉంటుంది.