అచ్చంపేట నియోజకవర్గం:
మండలాలు:
1) అచ్చంపేట, 2) లింగాల, 3) బల్మూరు, 4) పదర, 5)అమ్రాబాద్, 6)ఉప్పునుంతల, 7) చారకొండ, 8)వంగూరు..
ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (టీఆర్ఎస్)
Achampet Election Results 2018
Achampet 2018 Assembly Elections
Candidate Name | Party | Votes |
GUVVALA BALARAJU | Telangana Rashtra Samithi | 88073 |
CHIKKUDU VAMSHIKRISHNA | Indian National Congress | 78959 |
MEDIPUR MALLESHWAR | Bharatiya Janata Party | 3222 |
SRINIVASULU KOYYALA | Bahujan Samaj Party | 821 |
MAHESH PALLE | Independent | 798 |
BODDUPALLY SHEKAR | Bahujana Left Party | 732 |
YELIMINETI RAJESH | Independent | 433 |
CHARAGONDA KRISHNAMMA | Independent | 291 |
GENTALA MALLAIAH | Independent | 269 |
MUDDAMOLLA RAJAMOULI | Samajwadi Party | 235 |
None of the Above | None of the Above | 2406 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | GUVVALA BALARAJU | TRS | 88073 | CHIKKUDU VAMSHIKRISHNA | INC | 78959 |
2014 | Guvvala Balaraju | TRS | 62584 | Chikkudu Vamshikrishna | INC | 50764 |
2009 | P.Ramulu | TDP | 67361 | Dr.C.Vamshi Krishna | INC | 62530 |
2004 | Dr.Vamshi Krishna | INC | 65712 | P.Ramulu | TDP | 45047 |
కాంగ్రెస్కు కంచుకోట అయిన అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణపై గెలుపొందారు. టీఆర్ఎస్లో ద్వితియ శ్రేణి నాయకులను ఎదగనీయడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి డా.చిక్కుడు వంశీకృష్ణ కొత్త జిల్లాలు ఏర్పాడ్డాక డీసీసీ అధ్యక్షుడయ్యారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడుతున్నారు. రేవంత్ పీసీసీ ప్రసిడెంట్ అయ్యే ముందు రైతుల సమస్యలపై అచ్చంపేట నుంచి భారీ ఎత్తున పాదయాత్ర చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. బీజేపీ సంస్థగతంగా బలంగా లేకున్నా..అక్కడక్కడ క్యాడర్ ఉంది. ఆపార్టీ నుంచి మల్లెష్ రంగంలో ఉన్నారు. వచ్చె ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇవ్వోచ్చు.
ఇది కూడ ఎస్సీ నియెజకవర్గం: ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉంటారు. గెలుపోటములు నిర్ణయించే శక్తి వీరికే ఉంది. బీసీలు, రెడ్డిలు రెండవ స్థానంలో ఉన్నారు. గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న కానిస్టెన్సీ…
నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు:
అచ్చంపేట నల్లమల అటవీప్రాంతం. అటవీప్రాంతంలో నివసిస్తున్న చెంచుల కుటుంబాలను అటవీశాఖాధికారులు ఖాళీ చేయాలని ఆర్డర్లేశారు. దీన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అడవిలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. చెంచు జాతి అంతరించిపోకుండా చూడాలని ఆందోళన చెస్తున్నారు.
యూరేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న ఈనియోజకవర్గంలో తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బడా కంపెనీలు యత్నిస్తున్నాయి. దీనివల్ల అటవీప్రాంతంతో పాటు అనేక గ్రామాలకు దీని ఎఫెక్ట్ పడుతుందని, అంతేకాక చెంచుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది.
అటవీ ప్రాంతంలో పోడు భూములున్న రైతులకు సాగు చేయడానికి ఇయ్యడం లేదు. అనేక ఆందోళనలు చేపట్టారు. ఆత్మహత్య యత్నాలకు పాల్పడ్డారు.పోడు భూమి సాగు చేయనివ్వాలన్నది ప్రధాన డిమాండ్.