చారిత్రక నేపథ్యం: బీజాపూరును పాలించిన సుల్తాను యూసఫ్ ఆదిల్షా
పేరు జిల్లాకు స్థిరంగా ఉండిపోయింది. దీర్ఘకాలం పాటు జిల్లా
ఒక సజాతీయ యూనిట్‌గా కొనసాగలేదు. ఈ ప్రాంతాన్ని చరిత్రగతిలో
అనేక వంశాల రాజులు పాలించారు. మౌర్యులు, శాతవాహనులు,
వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు,
మొఘల్స్, నాగ్‌పూర్‌కు చెందిన భోంస్లే రాజులు, అసఫ్జాహీలు, సిర్పూర్
మరియు చందాలకు చెందిన గోండు రాజులు
ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించారు.
మొదట్లో ఇది పూర్తి స్థాయి జిల్లాగా ఉండేది కాదు. ఎదులబాద్/ ఎద్దులాపురం,
రాచూర, సిరిపూర్ తాలూకాలతో సహ సిర్పూర్ – తాండూరు జిల్లాను 1872లో ఏర్పాటు –
చేశారు. 1905లో పూర్తిస్థాయి స్వతంత్ర జిల్లాగా ఏర్పాటు చేశారు.
పూర్వం ఈ జిల్లాలో ఎద్దుల సంత పెద్ద ఎత్తున జరిగేది. అందువల్ల
ఎద్దులాపురం/ ఎడ్లవాడగా పిలిచేవారు. అదిలాబాద్ జిల్లా తెలంగాణ .
అక్షరక్రమంలో, చిత్రపటంలో అగ్రస్థానంలో ఉన్నది.
వాతావరణం: జిల్లాలో వేడి ఎక్కువ. నైరుతి రుతుపవనాల
కాలంలో తప్ప మిగిలిన కాలాల్లో జిల్లా వాతావరణం
పొడిగా ఉంటుంది. ఏడాది మొత్తాన్ని నాలుగు సీజన్లుగా విడగొట్టారు.
డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం, ఆ తరువాత మార్చి-మే
మధ్యకాలంలో వేసవి కాలం జిల్లాలో కొనసాగుతుంది. జూన్ నుండి
సెప్టెంబర్ మాసం వరకు నైరుతి రుతుపవనాల కాలం. వార్షిక
వర్షపాతంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. జిల్లా కేంద్రమైన
ఆదిలాబాద్ లో వాతావరణ పరిశీలక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాలో చలి వాతావరణం నవంబర్ మాసంలో ప్రారంభమై తరువాత
వేగంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇక డిసెంబర్ అతి శీతల కాలం’
ఈ నెలలో రోజువారిగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, 15
డిగ్రీలుగా నమోదవుతాయి. – నైరుతి రుతుపవన కాలంలోనే
వాతావరణంలో సాపేక్షంగా తేమ నమోదవుతుంది. ఎండాకాలంలో
మధ్యాహ్నాం తేమ 25% నమోదవుతుంది. ఈ కాలంలో ఆకాశం
దట్టమైన మేఘాలతో ఆవరించి ఉంటుంది. గాలులు కూడా తేలికగా
ఉండి మే నుండి ఆగస్టు వరకు కొంతమేర బలోపేతమవుతాయి.
రుతుపవనాల తరువాత జిల్లాలో తూర్పు లేదా దక్షిణ దిశ గాలులు
వీచడం ప్రారంభం అవుతాయి.
పర్వతాలు-నదులు:
జిల్లాలో సహ్యాద్రి, సాత్నాల పర్వత శ్రేణులు
వాయువ్యం నుండి అగ్నేయం దిశగా మొత్తం 218.5 కిలోమీటర్ల
పొడవునా వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాల్లో మహబూబాఘాట్ అతి
పెద్ద శిఖరం. ఇక జిల్లాకు తూర్పు ప్రాంతంలో కొన్ని కొండలు, గుట్టలు
ఉన్నప్పటికీ వాటికి అంత ప్రాధాన్యం లేదు.
జిల్లాలో పెన్ గంగానది ప్రవహిస్తుంది. కడెం, పెద్దవాగు గోదావరి నదికి
ఉపనదులు. వీటితో పాటు సాత్నాల, స్వర్ణవాగు, సుద్దవాగు ఉన్నప్పటికీ
ఎండాకాలంలో ప్రవహిస్తోంది.
జిల్లా ప్రత్యేకతలు: తెలంగాణకు ఉత్తరపు అంచున ఉన్న ఈ
జిల్లా తెలంగాణ కాశ్మీర్‌గా అభివర్ణించబడుతుంది. దేశంలోనే గోండు జాతి
ఆదివాసులు ఎక్కువగా ఉన్నారు. గిరిజన సంస్కృతికి ఆలవాలం.
అందాల నిలయం ఆదిలాబాద్ జిల్లా,
నాగోబా దేవాలయం: నాగోబా జాతరను గోండు గిరిజన
(మెస్రం) జాతికి చెందిన ప్రజలు జరుపుకుంటారు. ఈ జాతర
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోని గోండు గిరిజన తెగ
ప్రతి సంవత్సరం పుష్య మాసంలో బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు.
ఇది 10 రోజుల పాటు జరుగుతుంది.
జైనాథ్ లక్ష్మీనారాయణ దేవాలయం: ఇది ఆదిలాబాద్ జిల్లాలోని
జైనాథ్ గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయం అష్టకోణాకృతిలో
ఉంటుంది. దీనిని లక్ష్మీనారాయణునికి అంకితం చేశారు. ఈ ఆలయం
జైనుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనమని చెప్పవచ్చును. ఈ ఆలయం
సూర్యదేవాలయంగా గుర్తింపు పొందింది.
బుర్నూర్ జాతర: ఇది ఆదిలాబాద్ ఉట్నూరు మండలంలో
జరుగుతుంది.
కుంటాల జలపాతం: ఇది కడెంవాగుపై కలదు. తెలంగాణలో రెండవ
ఎత్తైన జలపాతం. దీని ఎత్తు 45 మీటర్లు. నేరడిగొండ మండలంలో
ఉంది. దుష్యంతుని భార్య శకుంతల పేరు మీదుగా ఈ జలపాతం పేరు
వచ్చింది. ఇక్కడ సోమేశ్వరస్వామిగా పిలిచే శివాలయం ఉంది.