ఇండస్ట్రీలో ఒకేరకమైన కథతో హిట్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు . వాస్తవానికి కొత్త కథలు అంటూ ఉండవు కూడా .. ప్రతి సినిమాలో కూడా ఎక్కడో ఒక చోట పాత సినిమాలకు సంబంధించిన ఛాయలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. సీనియర్ హీరో అక్కినేని నాేశ్వరరావు, నటసింహం బాలకృష్ణ ఒకే రకమైన కథలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.
అక్కినేని, దాసరి నారాయణరావు లది సూపర్ సూపర్ హిట్ కాంబినేషన్..వీరి కలయికలో వచ్చిన చిత్రం ప్రేమాభిషేకం.. వీరి కాంబినేషన్ లో ఇది ఆరో చిత్రం. ఇందులో శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించారు. దేవదాసు సినిమాలోని పార్వతి, చంద్రముఖిలను ప్రేరణగా తీసుకొని దాసరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఈ సినిమాలో హీరోకి క్యాన్సర్ అని తెలియడంతో ఆ విషయాన్ని దాచిపెట్టి హీరోయిన్ కు వేరే వివాహం జరిగేలా హీరో అక్కినేని ప్రవర్తిస్తాడు. ఇందులోని ఏఎన్నార్ నటనకి ప్రేక్షకులు నీరాజనం పలికారు.
అయితే ఇదే సినిమా స్పూర్తితో రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాలకృష్ణ బొబ్బిలి సింహం కథను రాసుకున్నారు.ఈ సినిమాలో హీరోకి బదులుగా హీరోయిన్ కు క్యాన్సర్ పెట్టి దానిని దాచిపెట్టి హీరోకి మరో పెళ్లి చేస్తుంది హీరోయిన్. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా త్రివిక్రమ రావు ఈ చిత్రానికి నిర్మించారు. అయితే ప్రేమాభిషేకం చిత్రం వచ్చిన 13 ఏళ్లకు బొబ్బిలి సింహం చిత్రం రావడం విశేషం. మీనా, రోజా హీరోయిన్లుగా నటించారు.