ఒకే స్టోరీ లైన్ తో చాలా సినిమాలు రావడం మనం చూసుంటాం. ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే.. కానీ ఒకే స్టోరీ లైన్ తో రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవడం అనేది చాలా రేర్ . ఇలాంటి రేర్ ఇన్సిడెంట్ తెలుగు ఇండస్ట్రీలో 1989వ సంవత్సరంలో జరిగింది. ఇంతకీ ఆ రెండు చిత్రాలు ఏంటంటే వెంకటేష్ హీరోగా వచ్చిన దృవనక్షత్రం ఒకటి కాగా, రెండోది బాలకృష్ణ హీరోగా వచ్చిన అశోక చక్రవర్తి.
అశోక చక్రవర్తి విషయానికి వస్తే.. ఎస్.ఎస్.రవి చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన భానుప్రియ హీరోయిన్ గా నటించింది. ఇళయరాజా సంగీతం అందించారు. 1988లో మలయాళం స్టార్ మోహన్ లాల్ -నటించిన ఆర్యన్ చిత్రానికి ఇది రిమేక్. ఇక ధృవ నక్షత్రం విషయానికి వస్తే.. నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన రజనీ హీరోయిన్ గా నటించింది. ఇళయరాజా చక్రవర్తి అందించారు.
ఈ రెండు చిత్రాలు 1989 జూన్ 29న రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు చూసిన ప్రేక్షకులు ఈ రెండు సినిమా స్టోరీ లు ఒకేలాగా ఉన్నాయని ఆశ్చర్యపోయారంట. అయితే ఇందులో బాలయ్య అశోక చక్రవర్తి ప్లాప్ కాగా, వెంకటేష్ ధృవ నక్షత్రం బాక్స్ ఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించడం విశేషం. మొత్తంగా ఒక తరహా కథలో ఇద్దరు హీరోలు నటించడం అనేది ఇండస్ట్రీలో రేర్