నందమూరి బాలకృష్ణ దర్శకుడు బి గోపాల్ లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో లారీ డ్రైవర్ చిత్రం తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ అనే చిత్రం తెరకెక్కింది. మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన ఈ చిత్రం మే 7 1992 లో రిలీజ్ అయింది. విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు బప్పిలహరి సంగీతాన్ని అందించాడు.
ఈ సినిమాలో బాలయ్య పోలీస్ పాత్రలో నటించారు. అందుకోసం బాలయ్య బాగానే ప్రాక్టీస్ చేశారట. పోలీసులు ఎలా నడుస్తారు. ఎలా ఉంటారు. జీపులో ఎలా కూర్చుంటారు అనే అంశాలను బాలయ్య బాగా పరిశీలించారట.. షూటింగ్ కూడా పోలీస్ జీపులోనే వచ్చేవారట బాలయ్య. ఈ విషయాన్ని దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ఈ సినిమా కంటే ముందు బొబ్బిలి సింహం అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఆ టైటిల్ కు తగ్గట్టుగా కథను ప్లాన్ చేశారట. కానీ ఆవి సెట్ కాలేదట. చివరికి పుష్పానంద్ అనే రైటర్ చెప్పిన కథను ఫిక్స్ చేశారట. అదే రౌడీ ఇన్స్పెక్టర్.
ఈ సినిమాను బాలయ్య పుట్టిన రోజున దర్శకుడు కోదంరామిరెడ్డి క్లాప్ తో ప్రారంభించారు. అయితే ముందుగా అనుకున్న బొబ్బిలి పులి టైటిల్ తో బాలయ్య హీరోగా తెరకెక్కిన చిత్రానికి కోదంరామిరెడ్డినే డైరెక్టర్ కావడం విశేషం.