* ఎడమ వైపు పడుకోవడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. పేగుల నుంచి వ్యర్థాలను తొలగించడం సులభమవుతుంది.
* జీర్ణక్రియకు కీలకమైన కాలేయ పని తీరులో సహాయపడుతుంది.
* గుండెల్లో మంట, మలబద్దకం, ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* మెదడు నుంచి మఝ్యంతర వ్యర్థాలను తొలగించి, మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
* గురక, స్నీప్ అప్నియా వంటి సమస్యలను తగ్గిస్తుంది.
* ఎడమవైపు పడుకున్నపుడు రక్తప్రసరణ సులభతరం అవుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
* గర్భిణీ స్ర్తీలు ఎడమవైపు పడుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీని వల్ల గర్భాశయం, పిండానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది.
* ఎడమవైపు పడుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలను తొలగించడం సులభతరం అవుతుంది.
జాగ్రత్త
భుజం నొప్పి, దవడ గట్టిగా ఉన్నవారికి ఎడమవైపు పడుకోవడం అంతగా మంచిది కాదు.
సరిగ్గా ఎడమవైపు పడుకోవడం ఎలా..
మంచి దిండును సెలక్ట్ చేసుకుని, దాన్ని మోకాళ్ల మధ్య ఉంచాలి. మరొక దిండు తీసుకుని కౌగిలించుకోవాలి. ఈ సమయంలో మీ చేతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా చూసుకోండి.