చక్కటి న్యాయ ఉపాయం.. లెజిట్‌క్వెస్ట్‌

ప్రపంచం మారిపోతోంది. వారాలు, నెలలు, సంవత్సరాలుపట్టే పనులు చిటికెలో పూర్తయ్యే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇటీవలికాలంలో ఆర్టిఫిషియల్‌ఇంటెలిజెన్స్‌(ఏఐ) అన్నిరంగాల్లో విస్తృతమైన మార్పులకు కారణమవుతున్నది. మనదేశంలో కార్యనిర్వాహక వ్యవస్థల్లో టెక్నాలజీ వినియోగం పౌరసేవల్ని వేగవంతం చేశాయి. అయితే న్యాయవ్యవస్థలో మాత్రం అవసరం మేరకు సాంకేతిక మార్పులు చోటుచేసుకోకపోవడం ఇబ్బందికరంగా మారింది. కోర్టు వ్యవహారం అనగానే ‘ వామ్మో, ఇది ఇప్పట్లో తేలేదికాదులే..’ అన్న లోచన కలుగుతుంది. మరి కోర్టుల్లో కాలయాపన తగ్గించడం సాధ్యంకాదా? వ్యక్తులకు సత్వరన్యాయం దక్కే వీలులేదా? అన్న ప్రశ్నలనుంచి పుట్టిందే లెజిట్‌క్వెస్ట్‌అనే ఆన్‌లైన్‌లీగల్‌రీసెర్చ్‌ప్లాట్‌ఫాం.

ఆర్టిఫిషియల్‌ఇంటెలిజెన్స్‌ఆధారంగా పనిచేసే ఈ సెర్చ్‌ప్లాట్‌ఫాం.. ఒక్క క్లిక్‌తో ఏ కేసుకు సంబంధించిన వివరాలనైనా మన ముందుంచుతుంది. అంటే, లీగల్‌రీసెర్చ్‌కు పట్టే సుదీర్ఘకాలాన్ని గరిష్టంగా తగ్గిస్తుందన్నమాట. లీగల్‌టెక్‌వెంచర్‌ను ఢిల్లీకి చెందిన యువ అడ్వకేట్‌కరణ్‌కాలియా రూపొందించారు. లెజిట్‌క్వెస్ట్‌ టెక్‌సావీలుగానూ పేరుపొందిన అటార్నీలు, ఇంజనీర్లు, డిజైనర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్‌చేస్తుంటారు.
అసలు కోర్టు వ్యవహారాలు ఎందుకు ఆలస్యమవుతాయి? అనే ప్రశ్నకు సిబ్బంది కొరతనే ప్రధాన సమాధానంగా చెప్పొచ్చు. దాంతోపాటు సాంకేతిక వెనుకబాటు కూడా కీలకాంశమే అని కరణ్‌అంటున్నారు. ఫలానా కేసును విచారించే జడ్జి.. దానితోపాటు సంబంధిత కేసుల వివరాలను, రిలేటివ్‌కేసుల్లో (గతంలో) ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పరిశీలించడం పరిపాటి. గంటలకొద్దీ గూగుల్‌లో సెర్చ్‌చేసినా తనకు కావలసిన పాయింట్లు దొరకవు. అంతోఇంతో సమాచారం దొరికినా అది న్యాయవ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా ఉందా అన్నది గుర్తించడం కష్టం. ఈ సుదీర్ఘ కాలయాపన కారణంగా.. కేసును తేల్చేయాలని జడ్జిగారు భావించినా సాధ్యం కాని పరిస్థితి. ఈ సమస్యలకు పరిష్కారంగా పుట్టుకొచ్చిన లెజిట్‌క్వెస్ట్‌లో 1950 నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటినీ పొందుపర్చారు. విచారణ పూర్వాపరాలతోపాటు ఆయా తీర్పులు ఇచ్చిన జడ్జిల పేర్లు, జడ్జిమెంట్లను అందుబాటులో ఉంచారు.
అందరికీ ఉపయోగం..
ప్రపంచంలోనే అరుదైన ప్రకరణగా 2017 నుంచి అందుబాటులోకి వచ్చిన లెజిట్‌క్వెస్ట్‌.. న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర విద్యార్థులు, లిటిగెంట్లుగా ఉండే సంస్థలు, పౌరులు అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. న్యాయ పరిశోధనకు సాంకేతిక విజ్ఞానాన్ని మరింతగా జోడించే దిశగా ఈ వెబ్‌సైట్ పని చేస్తోంది. ఏఐ ఆధారంగా రూపొందించిన ఐ-సెర్చ్, ఐ-డ్రాఫ్ట్‌, ఐ- గ్రాఫిక్‌ఫీచర్లు.. లక్షలాది ఫైళ్లను వాటంతట అవే పరిశీలించి, మనకు అవసరమైన కేసుకు సంబంధించిన వివరాలను క్షణాల్లోనే చూపెడుతుంది. దీనివల్ల కేసుల విశ్లేషణకు పట్టే సమయం గరిష్టంగా తగ్గిపోతుంది. కేసులకు సంబంధించిన సహేతుకు అంశాలన్నింటినీ లెజిట్‌క్వెస్ట్‌ద్వారా పొందొంచ్చని రూపకర్తలు అంటున్నారు.

సత్వర న్యాయం కోరే సాధారణ వ్యక్తిని
‘‘న్యాయమూర్తుల నియమకాల్లో ప్రభుత్వ జాప్యం వాస్తవం. అయితే ప్రభుత్వేతర అంశాల్లో మనమేదైనా చేయొచ్చా అన్న ఆలోచన నుంచే లెజిట్‌క్వెస్ట్‌పుట్టుకొచ్చింది. లీగల్‌రీసెర్చ్‌ఎంత కాలయాపనతో కూడిన వ్యవహారమో ఒక లాయర్‌గా నాకు బాగా తెలుసు. యూనివర్సిటీ ఆఫ్‌ఢిల్లీలో ఎల్‌ఎల్‌బీ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌పెన్సిల్వేనియా(యూఎస్‌) లో ఎల్‌ఎల్‌ఎం చేశాను. బిజినెస్‌అండ్‌లా ప్రోగ్రామ్‌కూడా అక్కడే పూర్తిచేసి 2016లో ఇండియాకు తిరిగొచ్చేశా. ఎవరికైనాసరే, సత్వర న్యాయం దక్కాలని కోరుకునే సగటు భారతీయుల్లో నేనూ ఒకడిని. లెజిట్‌క్వెస్ట్‌ఐడియాను టెక్‌వెంచర్‌గా మార్చడానికి ఏడాది సమయం పట్టింది. సోదర అడ్వొకేట్లు, ఇంజనీర్లు, డిజైనర్లు టీమ్‌గా పనిచేస్తున్నాం. ప్రఖ్యాత లాయర్‌రాంజఠ్మలానీ మా మెంటర్‌. వేగవంతమైన విచారణ కోసం సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన (జస్టిస్‌మదన్‌బి లోకూర్‌నేతృత్వంలోని) ఈ-కమిటీ ముందు ప్రెజెంటేషన్‌ఇచ్చాం. లెజిట్‌క్వెస్ట్‌ను అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తీర్పులను మాత్రమే వెబ్‌సైట్‌లో పొందుపర్చాం. అతి త్వరలోనే హైకోర్టుల తీర్పులు, ఆయా కేసుల వివరాలను అందుబాటులోకి తీసుకొస్తాం. అపరిష్కృతంగా ఉన్న 3.2 కోట్ల కేసులు పరిష్కారం కావాలన్నా, ఆ సంఖ్య మరింతగా పెరగకుండా ఉండాలన్నా లీగల్‌రీసెర్చ్‌కోసం కేటాయించే సమయం గణనీయంగా తగ్గాలి. ఆ పనిలో మేమెప్పుడూ ముందుంటాం’’ అని వివరించారు లెజిట్‌క్వెస్ట్‌ఫౌండర్‌సీఈవో కరణ్‌కాలియా.
ఫీజు కొంచమే
లెజిట్‌క్వెస్ట్‌లోకి సబ్‌స్ట్రైబ్‌అయినవారు తొలి 7 రోజులూ సమాచారాన్ని ఉచితంగా పొందొంచ్చు. ఆ తర్వాత నెలకు రెండున్నరవేల రూయాయలు రుసుము చెల్లించాల్సిఉంటుంది. సంవత్సర చందా కూడా కట్టొచ్చు. సత్వరన్యాయానికి తనవంతుగా చక్కటి ఉపాయాన్ని రూపొందించిన లెజిట్‌క్వెస్ట్‌టీమ్‌కు సర్వత్రా అభినందనలు లభిస్తున్నాయి.

దేశంలో ఎన్ని కోర్టులులున్నాయి?
అధికార క్రమంలో కోర్టులు ప్రధానంగా మూడు రకాలు.
సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు), హైకోర్టులు, జిల్లా కోర్టులు(సబార్డినేట్‌జ్యుడిషియరీ స్థాయి).

  • దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకుగానూ 24 హైకోర్టులున్నాయి)
  • సుమారు 600 జిల్లా కోర్టులు.
  • వీటిలో మళ్లీ సివిల్‌, క్రిమినల్‌కేసులను బట్టి జూనియర్‌సివిల్‌జడ్జి కోర్టు, ప్రిన్సిపల్‌జూనియర్‌అండ్‌సివిల్‌జడ్జి కోర్టు, సెకండ్‌క్లాస్‌జ్యుడిషియల్‌మెజిస్ట్రేట్‌కోర్టు, ఫస్ట్‌క్లాస్‌జ్యుడిషియల్‌మెజిస్ట్రేట్‌కోర్టు, చీఫ్‌జ్యుడిషియల్‌మెజిస్ట్రేట్‌కోర్టు తదితర విభాగాలున్నాయి
    -2008 గ్రామ న్యాయాలయ చట్టాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా 5000 మొబైల్‌కోర్టులను ఏర్పాటుచేయాలని భావించినా ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు.

ఉండాల్సిన జడ్జిల సంఖ్య 70 వేలు.. ఉన్నదేమో 17 వేలే!

  • ప్రతి 20 వేల మంది పౌరులకు ఒక న్యాయమూర్తి ఉండాలన్నది ప్రపంచ నమూనాగా ఉంది.
  • ఆలెక్కన 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో సుమారు 70 వేల మంది న్యాయమూర్తులు ఉండాలి.
  • అంతా కలిపితే మన దగ్గరున్న జడ్జిల సంఖ్య 17 వేలు దాటదు.
  • నేషనల్‌జ్యుడిషియల్‌డేటా(2016) ప్రకారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో 29 మంది జడ్జిలు, హైకోర్టుల్లో 621 మంది న్యాయమూర్తులు, సబార్డినేట్‌జ్యుడిషియరీ స్థాయిలో 16,119 మంది జడ్జిలు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • పెండింగ్‌లో ఉన్న 3.2 కోట్ల కేసులకు తోడు ప్రతిరోజూ కొత్తగా వచ్చి చేరుతోన్న వివాదాలకు లెక్కేలేదు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc