సరిహద్దులుగా ములుగు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలు,
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఉన్నాయి. జిల్లాలో మొత్తం 23 మండలాలు, రెండు
రెవెన్యూ డివిజన్లు కొత్తగూడెం, భద్రాచలం ఉన్నాయి. కొత్తగూడెం
పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. భద్రాచలం
రోడ్ రైల్వే స్టేషన్ ద్వారా కొత్తగూడెం ఇతర ప్రాంతాలతో మంచి
అనుసంధానతను కలిగి ఉంది. తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు,
పట్టణాలకు కొత్తగూడెం నుంచి బస్సు సదుపాయం ఉన్నది. జిల్లాలో
మొత్తం రెండు బ’పోలు, కొత్తగూడెం, భద్రాచలం ఉన్నాయి. కొన్ని |
ప్రముఖ పరిశ్రమలకు కొత్తగూడెం నెలవుగా ఉన్నది. బొగ్గు, మరికొన్ని |
ఇతర ఖనిజాలు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి.
జిల్లా ప్రత్యేకత: కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో
పనిచేసే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ప్రధాన
కార్యాలయం కొత్తగూడెంలోనే ఉన్నది. ఎస్ సీసీఎల్ ప్రస్తుతం 18
ఓపెన్ కాస్ట్ మరియు 24 భూగర్భ గనులను నిర్వహిస్తుంది. ఇవి మొత్తం
తెలంగాణలోని 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఎస్ సీసీఎల్ మొత్తం
శ్రామికశక్తి 48,942.
పాల్వంచలో ఉన్న కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం, తెలంగాణ
విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్ జెన్ కో) కింద ఉన్న బొగ్గు ఆధారిత
విద్యుత్ ప్లాంట్లలో ఒకటి. ఐటీసీ-పేపర్ బోర్డు నాణ్యమైన ఉత్పత్తికి
పేరుగాంచింది. ఇది భద్రాచలం సమీపంలోని సారపాక గ్రామంలో
ఉన్నది.
షెడ్యూల్డ్ తెగల జనాభా అధికంగా గల మొదటి జిల్లా.కొత్తగూడెం
జిల్లాలో అటవీ సంపద కూడా పుష్కలంగా ఉండటం గమనార్హం.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకతీయ యూనివర్సిటీ
(కేయూసీఈ) తెలంగాణలోని మొట్టమొదటి మైనింగ్ కళాశాల కాగా
దేశంలో రెండవది దీన్నే అంతకుముందు కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్
(కేఎస్ఎం) అని వ్యవహరించేవారు. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్
కళాశాల (గతంలో ప్రభుత్వ మైనింగ్ ఇన్స్టిట్యూట్)ను 1957లో నెల
కొల్పారు. సాంకేతిక విద్యను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.
నదులు పుణ్యక్షేత్రాలు; భద్రాచలం, కిన్నెరసాని, పర్ణశాల మొదలైన ఆసక్తి కలిగించే
అనేక ప్రదేశాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం
కొత్తగూడెం జిల్లాలోనే ఉంది. గోదావరి నది ఒడ్డునే ఉన్న భద్రాచలం
పట్టణంలో రామయ్య కొలువై ఉన్నాడు. ఈ పట్టణానికి రామాయణ
కాలం నాటితో సంబంధం ఉన్నది. భద్రగిరి పదం నుంచి భద్రాచలం
పేరు జనించింది. మేరు పర్వతం, మేనకలకు జన్మించిన వాడే భద్రుడు.
ఆయన పేరుమీద భద్రగిరి అని పేరు వచ్చింది. ఇక్కడి సీతారామ
లక్ష్మణ స్వయంభువులుగా వెలిసారు అని భక్తులు విశ్వసిస్తారు.
పాల్వంచ మండలంలోని యానంబోయిల్ గ్రామ సమీపంలో
కిన్నెరసాని నది పై కిన్నెరసాని ప్రాజెక్టును నిర్మించారు. గోదావరికి
కిన్నెరసాని అతిముఖ్యమైన ఉపనది. నది ఒడ్డునే అద్భుతమైన
భూదృశ్యాలు కనులవిందు చేస్తాయి. దండకారణ్య అడవుల్లోనే
కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది. ప్రకృతి ఒడిలో పరవశించే
వివిధ రకాల వన్యప్రాణులను ఇక్కడ వీక్షించవచ్చు. ఈ సంరక్షణ
కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దుమ్ముగూడెం
మండలంలో ఉన్న పర్ణశాల ప్రముఖ పర్యాటక
ప్రదేశం, రామాయణ కాలంలో రావణుడు సీతను అపహరించిన
ప్రదేశం ఇదేనని చెబుతారు. రామాయణ కాలంనాటి ఆయా దృశ్యాలను
చక్కని బొమ్మల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు.