బీఆర్​ఎస్​ ఏపీ అధ్యక్షునిగా తోట.. ఉద్యమ నేత శ్రీధర్​రెడ్డి మృతి.. ఫోన్​ హ్యకవుతోందన్న ఆర్​ఎస్​పీ.. చైనా కాలు దువ్వుతోంది..

బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్

బీఆర్ఎస్ తొలి రాష్ట్ర శాఖ ఆంధ్రాలో పురుడు పోసుకుంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్ను నియమించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ఏపీ లీడర్ల జాయినింగ్ కార్యక్రమం అత్యంత ఆర్భాటంగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి నియామకంతో పాటు ఏపీలో పార్టీ విస్తరణ చేపట్టేందుకు తలపెట్టిన లీడర్ల జాయినింగ్ కార్యక్రమం హడావుడిగా ముగిసింది. 

తొలిదశ ఉద్యమ నేత శ్రీధర్ రెడ్డి మృతి

తొలి దశ స్వరాష్ట్ర ఉద్యమ కారుడు, తెలంగాణ ప్రజాసమితి నాయకుడు ఎం.శ్రీధర్‌‌రెడ్డి సోమవారం మరణించారు. అనారోగ్యంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీదర్‌‌రెడ్డి, పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం మరణించారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. 1969 నాటి తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి శ్రీధర్‌‌రెడ్డి వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఓయూ అలుమిని సభ్యుని, ఓయూ విద్యార్థి సంఘం నాయకునిగా ఆయన పనిచేశారు. శ్రీధర్‌‌రెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.

లిక్కర్ కేసు‌నిందితుల‌ రిమాండ్ పొడిగింపు

లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు మరో ఏడు రోజుల జ్యూడీషియల్ రిమాండ్ పొడగించింది. ఈ స్కామ్లో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం తిహార్ జైళ్లో ఉన్నారు. గతంలో కోర్టు ఈ నలుగురికి విధించిన జ్యూడిషియల్ రిమాండ్ సోమవారంతో ముగిసింది. ఈడీ విజ్ఞప్తి మేరకు నలుగురు నిందితులకు మరో 7 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఫోన్లు హ్యాక్ అయితున్నయ్

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతల సెల్ ఫోన్లను సర్కారు హ్యాక్ చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో సామాన్యుల నుంచి లీడర్ల దాకా ఎవరి ఫోన్లకూ సేఫ్టీ లేదని, ముఖ్యంగా అపోజిషన్ లీడర్లు ధైర్యంగా సెల్ఫోన్వాడే పరిస్థితి లేదన్నారు. తన ఫోన్ కూడా హ్యాక్అయిందని, స్వయంగా ఆపిల్ నుంచి తనకు మెయిల్వచ్చిందని, దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్జడ్జితో విచారణ చేయించాలని సర్కారును డిమాండ్ చేశారు. ఇది పిరికిపంద చర్య అని అన్నారు. 

తుగ్లక్ నిబంధనలతో జీవితాలు నాశనమైతున్నయ్

పోలీస్ రిక్రూట్ మెంట్‌లో తుగ్లక్ నిబంధనలు విధించి అభ్యర్థుల జీవితాలతో తెలంగాణ సర్కార్ చెలగాటమాడుతోందని బీజేపీ స్టేట్​ ఛీఫ్ బండి సంజయ్  మండిపడ్డారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విషయంపై తాను బహిరంగ లేఖ రాసినా దున్నపోతు మీద వానపడ్డట్టు సర్కార్ వ్యవహరిస్తోందని  మండిపడ్డారు.  లాంగ్ జంప్, షార్ట్ పుట్ టెస్టుల్లో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలను తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పొందుపరిచిందని విమర్శించారు

సర్కార్ దొంగలా వ్యవహరిస్తోంది: రేవంత్

కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టించిందని, ఇది చట్టవిరుద్ధమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తప్పు చేసిన సీఎం కేసీఆర్‌‌పై కేసు పెట్టి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 35 వేల కోట్ల పంచాయతీ నిధులను దోచిన గజదొంగ అని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వేరే పనుల కోసం దారి మళ్లించారన్నారు. పంచాయతీలకు నిధులు లేక సర్పంచులు పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ సోమవారం ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ధర్నా చౌక్‌లో జరగాల్సిన ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతలను పోలీసులు నిర్బంధించారు.

ఎంపీ సంతోష్‌పై ఈడీకి ఫిర్యాదు

హరితహారం పేరుతో ఉపాధి హామీ పథకం నిధుల్ని బీఆర్ఎస్ రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ దారి మళ్లించారని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు  ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్   ఫిర్యాదు చేశారు. సోమవారం ఢిల్లీలోని ఈడీ డైరెక్టర్ ను కలిసి దాదాపు నాలుగు పేజీల కంప్లైంట్ కాపీని అందజేశారు. హరితహారం పేరుతో బీఆర్ఎస్ సర్కార్ 2014 నుంచి 2018 వరకు  రూ. 401 కోట్లను దారిమళ్లించిందని, దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఈడీని కోరినట్లు తెలిపారు. గ్రీన్ చాలెంజ్ పేరుతో సంతోష్  ప్రోగ్రాం చేపట్టారని, నిధులన్నీ ఆయన ఖాతాలోకి వెళ్లాయని జడ్సన్ ఆరోపించారు.

జమిలి ఎన్నికలు సాధ్యం కావు

బహుళ రాజకీయ వ్యవస్థ ఉన్న మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. దేశంలో ఎన్నికల సంస్కరణలు అవసరమని, ప్రభుత్వమే పార్టీల ఎన్నికల ఖర్చు భరించాలని గుప్తా కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చ జరగాలన్నారు. దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానం అవసరమన్నారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామరస్యతను రక్షించేందుకు 2024లో బీజేపీ, దాని మిత్రపక్షాలను  ఓడించాలని రాజా ప్రజలకు పిలుపునిచ్చారు.

నోట్ల రద్దు సరైన నిర్ణయమే:

ఆరేండ్ల కిందటి నోట్ల రద్దు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రూ.1,000, రూ.500 నోట్ల డీమానిటైజేషన్‌లో ఎలాంటి లోపమూ లేదని స్పష్టం చేసింది. 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజారిటీ తీర్పుతో సమర్థించింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి చట్టపరమైన, రాజ్యాంగ పరమైన లోపాలు లేవని, ఈ నిర్ణయం తీసుకునే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బీఐ), కేంద్ర ప్రభుత్వం మధ్య ఆరు నెలలపాటు సంప్రదింపులు జరిగాయని పేర్కొంది. నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సోమవారం తీర్పు చెప్పింది.

సీఎం‌ ఇంటి వద్ద బాంబ్ కలకలం

పంజాబ్ సీఎం భగవంత్  సింగ్  మాన్ ఇంటి దగ్గర  బాంబు కలకలం సృష్టించింది. సాయంత్రం 4 గంటల సమయంలో సీఎం హెలిప్యాడ్ కు సమీపంలో ఉన్న మామిడి తోటలో లైవ్ బాంబ్ షెల్ ను ట్యూబ్ వెల్ ఆపరేటర్ గా పనిచేసే ఒక వ్యక్తి గుర్తించాడు. అతను పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే బాంబ్  డిస్పోజల్  స్క్వాడ్ అక్కడికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేసింది. ఆర్మీకి చెందిన పశ్చిమ కమాండ్, పోలీస్ స్పెషల్ టీమ్స్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.

చైనా కాలు దువ్వుతోంది

ఉక్రెయిన్‌తో రష్యా ఎలాంటి విధానాన్ని అవలంబించిందో, ఇండియాతో చైనా అలాంటి వైఖరితోనే ఉందని, మన దేశ సరిహద్దులను మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్  నేత రాహుల్  గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘యూరోపియన్  దేశాలతో ఉక్రెయిన్   సంబంధాలు పెట్టుకోరాదని రష్యా బెదిరించింది. తమ మాట కాదని అలా చేస్తే, ఉక్రెయిన్  సరిహద్దులను మారుస్తామని రష్యా హెచ్చరించింది. చైనా కూడా మన దేశం విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది…‘ అని రాహుల్  వ్యాఖ్యానించారు. సినీ నటుడు, మక్కళ్  నీది మయ్యం ప్రెసిడెంట్ కమల్  హాసన్ తో ఈ మేరకు మాట్లాడిన వీడియోను రాహుల్  సోషల్  మీడియాలో విడుదల చేశారు. 

జమ్మూలో పేలుడు.. ఆరుగురు మృతి:

జమ్మూకాశ్మీర్‌‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో నాలుగు, ఏడేండ్ల వయసున్న అక్కాతమ్ముళ్లతో పాటు ఆరుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలోని డంగ్రీ గ్రామంలో సోమవారం 9.30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు నిరసనగా రాజౌరి టౌన్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సీనియర్‌‌ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.

గాల్లో హెలికాప్టర్ల యాక్సిడెంట్:

 ఆస్ట్రేలియాలో సోమవారం మధ్యహ్నం ఘోర ప్రమాదం జరిగింది. క్వీన్స్‌లాండ్ స్టేట్ గోల్డ్ కోస్ట్‌లోని మెయిన్ బీచ్ పైన గాలిలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.  టూరిస్ట్ స్పాట్ అయిన సీ వరల్డ్ థీమ్ పార్క్ బీచ్‌లో ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతోండగానే మరో హెలికాప్టర్ టేకాఫ్ అయ్యిందని.. దాంతో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయని వివరించారు.

లిక్కర్‌పై పన్ను ఎత్తివేత

గల్ఫ్ దేశాలంటేనే అక్కడి ప్రభుత్వాలు అమలు చేసే కఠినమైన ఆంక్షలు గుర్తుకొస్తాయి. కానీ, దుబాయ్  ఇప్పుడు అక్కడి ప్రజలకు ప్రభుత్వం కొంత స్వేచ్ఛ ఇస్తున్నది. తాజాగా లిక్కర్పై ఉన్న 30శాతం పన్ను ఎత్తేసింది. గతంలో ఇంట్లో మందు తాగాలన్నా పర్సనల్ లైసెన్స్ ఉండాలి. దీని కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ఈ రూల్ను కూడా దుబాయ్ సర్కార్ ఎత్తేసింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here