గులాబీమయమైన ఖమ్మం.. రేపే బీఆర్​ఎస్​ భారీ సభ.. ఉప్పల్​లో ఇండియా న్యూజిలాండ్​ మ్యాచ్​.. 24న కొండగట్టుకు పవన్​ కల్యాణ్​.. ఆర్​ఆర్​ఆర్​కు మరో అవార్డ్​

ఖమ్మం సభకు బీఆర్​ఎస్​ భారీ ఏర్పాట్లు

ఖమ్మంలో బుధవారం జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆ పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత తొలి సభ కావటంతో ఈ సభను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దాదాపు అయిదు లక్షల మందిని సమీకరించాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. 100 ఎకరాల్లో సభా ఏర్పాట్లతో పాటు 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటు చూసినా బీఆర్​ఎస్​ కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో ఖమ్మం గులాబీ మయమైంది. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఈ సభకు హాజరవుతున్నారు. సీఎంల కోసం ప్రత్యేకంగా రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. ఆమ్​ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌‌‌‌, సీపీఎంకు చెందిన కేరళ సీఎం పినరయి విజయన్, సమాజ్‌‌‌‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా రానున్నారు. వీరందరూ మంగళవారం సాయంత్రమే హైదరాబాద్​కు చేరుకుంటారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్​ ముగ్గురు సీఎంలతో కలిసి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి.. లక్ష్మీ నర్సింహస్వామి దర్శనం చేసుకుంటారు. అక్కణ్నుంచి ఖమ్మం వెళ్లి కొత్త కలెక్టరేట్‌‌‌‌ను ప్రారంభిస్తారు. లంచ్ తర్వాత బహిరంగ సభలో లీడర్లు పాల్గొంటారు.

సంక్రాంతి 1.21 కోట్ల మంది ఆర్టీసీ బస్సెక్కారు

సంక్రాంతి టీఎస్​ ఆర్టీసీకి పండుగ తెచ్చిపెట్టింది. ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది సంక్రాంతితో పోలిస్తే దాదాపు 5 లక్షలు మంది ఎక్కువగా బస్సుల్లో ప్రయాణించారు. పండుగ సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు 3,203 ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. సంక్రాంతికి బస్సుల్లో ప్రయాణించిన వారికి ధన్యవాదాలు తెలిపిన సజ్జనార్​.. ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు.  

ఉప్పల్​లో రేపు భారత్​ న్యూజిలాండ్​ మ్యాచ్​

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రేపు ఇండియా న్యూజిలాండ్​ వన్డే మ్యాచ్​ జరుగనుంది. న్యూజిలాండ్, ఇండియా టీమ్​లు సోమవారమే హైదరాబాద్​కు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్​ టికెట్లు భారీగా సేల్​ అయ్యాయి. సోమవారం ఆన్‭లైన్‭లో పెట్టిన అరగంటలోపే వేలాది టికెట్లు సేల్ అయ్యాయి. ఈ మ్యాచ్ కోసం 14న 6 వేల టికెట్లు, 15న 7 వేల టికెట్లు, 16న 9 వేల టికెట్లు ఆన్‭లైన్‭లో అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ఆన్‭లైన్‭లో 29 వేల టికెట్లను హెచ్‭సీఏ అధికారులు విక్రయించారు. ఆన్‭లైన్‭లో టికెట్స్ బుక్ చేసుకున్నవారందరూ మెసేజ్​ చూపించి ఆఫ్​లైన్​ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ల పంపిణీకి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

రిమోట్​ ఓటింగ్​కు నో చెప్పిన బీఆర్​ఎస్​

రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్​ఎస్​ తరఫున వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్లానింగ్​ విభాగం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ చెప్పారు. రిమోట్ ఓటింగ్ విధానం ప‌ద్ధతి ఇండియాలో అవ‌స‌రం లేదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప‌క్కన పెడుతున్నాయని చెప్పారు. పార్టీలో చర్చించి.. ఈనెల 30వ తేదీలోపు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లిఖిత పూర్వకంగా పార్టీ అభిప్రాయం తెలుపుతామని అన్నారు. ఢిల్లీలో ఈసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తొమ్మిది రాష్ట్రాలపై ఫోకస్​ పెట్టిన నడ్డా

ఈ ఏడాది జరగబోయే 9 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.ఏ ఒక్క చోట కూడా బీజేపీ ఓటమి చెందకుండా వ్యూహరచన చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోడీ హయాంలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

బీఆర్​ఎస్ లీడర్లపై మండిపడ్డ బీఎస్​పీ ప్రవీణ్​కుమార్​

సిర్పూర్ నియోజకవర్గంలో భూ కబ్జాల వెనక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. రేషన్ బియ్యం కుంభకోణంలో కూడా ఎమ్మెల్యే కోనేరు కొనప్ప హస్తం ఉందన్నారు. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో బీఎస్పీ నాయకులు  నిర్వహించిన ‘బహుజన రాజ్యాధికార మహాసభ’లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఆఫీసర్ రాణి కుమిదిని కాదని శాంతి కుమారిని సీఎస్​గా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ పలకడం ఖాయమని అన్నారు.  సిర్పూర్ పేపర్ మిల్లులో 70 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్​ చేశారు.

ఆర్​ఆర్​ఆర్​కు మరో అవార్డు

నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఆర్ఆర్​ఆర్​ మూవీకి మరో అవార్డు దక్కింది. బెస్ట్ ఓరిజనల్ స్కోర్ మ్యూజిక్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ కు  ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’  అవార్డ్ లభించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ అవార్డ్ అందుకున్నారు.

24న కొండగట్టుకు పవన్​ కళ్యాణ్​

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 24న కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి కొండగట్టులో పూజలు చేయాలని పవన్​ నిర్ణయించారు. 2009లో కరీంనగర్​ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు విద్యుత్ తీగలు తగిలి పవన్​ ప్రమాదానికి గురయ్యారు. కొండగట్టు ఆంజనేయ స్వామి కటాక్షంతోనే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని.. అందుకే వచ్చే ఎన్నికల ప్రచార వాహనం వారాహికి కొండగట్టులో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.  

గంగులను పరామర్శించిన సీఎం కేసీఆర్​

బీసీ సంక్షేమం , ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గారు గంగుల మల్లయ్య ఇటీవల మరణించారు . కరీం నగర్ లో సోమవారం జరిగిన దశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నుండి కరీం నగర్ చేరుకున్న ముఖ్యమంత్రి కె ఎస్ ఎల్ ఫంక్షన్ హాల్ కు వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మంత్రి గంగులను , కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు

కుటుంబం బలి

ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. హబ్సిగూడలోని రూపాలి అపార్ట్ మెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మృతులను ప్రతాప్ (34), సింధూర (32), ఆద్య(4), ప్రతాప్ తల్లిగా గుర్తించారు. సింధూర హిమాయత్ నగర్ లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తుండగా.. ప్రతాప్  బీఎండబ్ల్యూ కారు షోరూమ్ లో మేనేజర్ గా విధులు పని చేస్తున్నాడు. ఇటీవలే ప్రతాప్​కు చెన్నై బదిలీ అయిందని, అక్కడికి షిప్ట్ అయ్యే విషయంలో కుటుంబీకుల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరిగాయని అపార్ట్మెంట్​ వాసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc