రోజూ ఎన్ని బాదంపప్పులు తింటే ఆరోగ్యకరమో తెలుసా..?

బాదం మెరుగైన ఆరోగ్యానికి మంచి గింజలుగా ప్రసిద్ది చెందినవు. సాధారణంగా ఈ గింజలను ఖాళీ కడుపుతో తినాలని నిపుణులు సూచిస్తున్నారు, ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బాదంపప్పులను ఏదైనా తినడానికి ముందే తీసుకోవాలి. ఇది జీర్ణం కావడం కష్టం కూడా. కాబట్టి, మితంగా తీసుకోవాలి.

రోజూ తినాల్సిన బాదంపప్పుల సంఖ్యపై ఓ ఆయుర్వేద నిపుణురాలు దీక్షా భావసర్ సావలియా సోషల్ మీడియాలో కీలక సమాచారాన్ని షేర్ చేశారు. అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వాటిని జీర్ణ సామర్థ్యం ఆధారంగా తినాలని సూచించారు.

ప్రతిరోజూ బాదంపప్పులను జీవన శైలిలో భాగం చేసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న విషయం తెలిసిందే. కానీ రోజూ ఎన్ని తినాలి. దానికి ఏమైనా పరిమితి ఏమైనా ఉందా అన్న విషయాలను డా. దీక్షా భావసర్ సావలియా చక్కగా తెలియజేశారు. బాదంపప్పు ఆలస్యంగా జీర్ణమయ్యే గింజలు. కావున వీటిని తినేందుకు కూడా పరిమితి విధించుకోవాలని ఆమె సూచిస్తున్నారు.

బాదంపప్పు తినడం మీకు ఇది కొత్తతే, కేవలం 2 నానబెట్టి, ఒలిచిన బాదంపప్పులతో ప్రారంభించడం ఉత్తమం. ఈ 2 అనే సంఖ్య చాలా తక్కువగా అనిపించవచ్చు. ఇది మీకు సరిపోతుంది. ఇలా ఒక వారం-10 రోజులు (మీ పొత్తికడుపు లేదా జీర్ణక్రియలో ఎటువంటి అసౌకర్యం లేకుండా) ప్రతిరోజూ 2 బాదంపప్పులను తినడం సౌకర్యంగా ఉన్న తర్వాత, వాటిని 5 కు పెంచి తినడం ప్రారంభించవచ్చు. ప్రతిరోజూ 5 నానబెట్టి, ఒలిచిన బాదంపప్పులను 21 రోజులు (3 వారాలు) తీసుకున్న తర్వాత, దాన్ని 10 బాదంపప్పులకు పెంచవచ్చు (మీకు కడుపు ఉబ్బినట్లు అనిపించకపోతే లేదా అతిసారం లేదా ఏదైనా జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే మాత్రమే). తర్వాత 3 నెలలకు (90 రోజులు) ప్రతిరోజూ 10 బాదంపప్పులను తీసుకోవచ్చు. అది ఒక రోజుకి సరిపడా మోతాదు. అప్పుడు మీరు రోజువారీ తీసుకోవడం చివరికి 12-15-18-20 ఇలా పెంచవచ్చు.

బాదం ప్రయోజనాలు

* ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఫీలయ్యేలా చేస్తుంది.
* ఇది మీ కోరికలను (చిరుతిళ్లు) దూరంగా ఉంచుతుంది.
* ఇది పీరియడ్స్ క్రాంప్‌లను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
* యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌లతో నిండినందున ఇది చర్మం, జుట్టుకు ఇది చాలా మంచిది.
* గుండెకు కూడా మంచిది (బీపీ, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది).

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here