ది ఫేమస్ రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రే… లాంటి చాలా మంది ప్రముఖులు మే నెలలోనే జన్మించారు. వారెవరెవరో ఇప్పడు చూద్దాం.
రవీంద్రనాథ్ ఠాగూర్
నోబెల్ సాహిత్య అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మే 7, 1861లో కోల్ కతాలోని జోరాసాంకో ఠాకూర్ బారిలో జన్మించారు. ఆయన కవి. శాస్త్రవేత్త, రచయిత, తత్త్వవేత్త, చిత్రకారుడు, సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు.
సత్య జిత్ రే
సత్య జిత్ రే మే 2, 1921లో జన్మించారు. అత్యుత్తమ చిత్రాలను నిర్మించిన నిర్మాతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన.. రచయితగా, చిత్రకారుడిగా, స్వరకర్తగానూ ప్రసిద్ధిగాంచారు. ది ఆపు త్రయం, చారులత లాంటి ఫేమస్ రచనలు కూడా ఆయన చేశారు.
గిరీష్ కర్నాడే
కన్నడ నటుడు, రచయిత, చిత్ర నిర్మాత గిరీష్ కర్నాడే మే 19, 1938న జన్మించారు. ఆయన జ్ఞానపీఠ్, పద్మశ్రీ, పద్మ భూషణ్ ఎంతో ప్రతిష్టమైన అవార్డులను కూడా దక్కించుకున్నారు.
సుమిత్రానంద్ పంత్
ప్రఖ్యాత భారతీయ కవిగా పేరు తెచ్చుకున్న సుమిత్రానంద్ పంత్ మే 20, 1900లో కౌసనిలో జన్మించారు. హిందీ సాహిత్యం అందించిన ప్రముఖ కవులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఆయన ముఖ్యంగా ప్రకృతిపై రాసిన కవితలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.
నయనతార సెహగల్
భారతీయ రచయిత్రి నయనతార సెహగల్ మే 10, 1927న జన్మించారు, రిచ్ లైక్ ఆన్ నవలకు 1986లో ఆమె సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. దేశంలో పెరుగుతున్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా, ఆ నిరసనకు గుర్తుగా ఆమె 2015లో దాన్ని తిరిగి ఇచ్చేశారు.
వినాయక్ దామెదర్ సావర్కర్
మే 28, 1883లో జన్మించిన వినాయక్ దామెదర్ సావర్కర్…రాజకీయ నాయకుడిగా, రచయితగా, ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్, మరాఠీలో ఆయన పలు రచనలు రాశారు. సావర్కర్ రాసిన ముఖ్యమైన పుస్తకాలలో హిందుత్వం, మోప్లా తిరుగుబాటు, ట్రాన్స్ పోర్టేషన్ చాలా ప్రసిద్ధి గాంచాయి.
రస్కిన్ బాండ్
బ్రిటన్ సంతతికి చెందిన భారతీయ రచయిత రస్కిన్ బాండ్ మే 19, 1934లో కసౌలిలో జన్మించారు. 60సంవత్సరాలకు రచనలు చేసిన ఆయనకు 1999లో పద్మశ్రీ, 2014లో పద్మ భూషణ్, సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు.