సానియా మీర్జా
భారత మహిళా టెన్నిస్ ను వెలుగులోకి తెచ్చిన సానియా మీర్జా.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ షుగర్ వంటి ధీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉంటున్నారు.
మేరీ కోమ్
తాను గెలవడానికి రహస్యాన్ని చెప్పిన మేరీ కోమ్.. దానికి సంకల్పం, శిక్షణపై ఏకాగ్రతతో ఉండడమని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మిథాలీ రాజ్
దేశంలో అత్యంత విజయవంతమైన మహిళల్లో ఒకరైన మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్.. తాను ఎల్లప్పుడూ స్ట్రాంగ్ గా ఉండడానికి రన్నింగ్, స్ట్రెంథ్ ట్రైనింగ్ ను ఫాలో అవుతూ ఉంటుంది.
గీతా ఫోగట్
ఆమె సంకల్పం, సరైన వ్యాయామమే గీతా ఫోగట్ గర్భధారణ తర్వాత బరువు తగ్గడానికి సహాయపడిందని ఆమె పోషకాహార నిపుణుడు ఇటీవలే ఇన్సా లో పోస్ట్ చేశారు.
సైనా నేహ్వాల్
తాను ఎల్లప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా భావిస్తానని సైనా నేహ్వాల్ చెబుతూంటారు. ఆమె ఫాలో అయ్యే ఫిట్ నెస్సే ఆమె ఆరోగ్యానికి సీక్రెట్ అని ఓ ఇంటర్వ్యూలోనూ పంచుకున్నారు.
అవని లేఖా
పారాలింపిక్స్ లో భారతదేశపు మొదటి మహిళా డబుల్ మెడలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు అవని లేఖా. తన శక్తిని, ఆటను మెరుగుపర్చుకోవడానికి ఆమె ఎల్లప్పుడూ సమతుల్య ఆహారమే తీసుకుంటారు.
పీటీ ఉష
దిగ్గజ భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా పేరు తెచ్చుకున్న పీటీ ఉష.. తన శక్తిని పెంచుకోవడానికి, ఫిట్ నెస్ గా ఉండడానికి బీచ్ వద్ద నీటిలో పరుగెత్తేవారట.
పటేల్
ఒలంపిక్స్ కు అర్హత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళా స్విమ్మర్ మన పటేల్. మనస్సు, శరీరం, ఆత్మను అన్నింటినీ నియంత్రించే ఫిట్ నెస్ కోసం ఆమె కసరత్తులు చేస్తారు.