షార్ట్ మెమొరీ లాస్ కాన్సెప్ట్ తో తెరకెక్కన సూర్య గజిని చిత్రాన్ని తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోని 12 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులోనే తీయాలని మురుగుదాస్ అనుకున్నారట. అందుకోసం అప్పుడు ఈ కథకు మహేష్ బాబు అయితే కరెక్ట్ గా సరిపోతారని మురుగుదాస్ అనుకుని వెళ్లి కథ చెప్పారట. అయితే హీరో ఒంటి నిండా పచ్చ బోట్లతో కనిపించాలి అనడంతో మహేష్ ఈ కథను రిజెక్ట్ చేశాడట.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌లను కలిసి కథను చెప్పారట మురుగుదాస్ . అయితే అప్పటికే జానీ ప్లాప్ తో కష్టాల్లో ఉండడంతో ఈ సినిమాకి పవన్ నో చెప్పేసాడట. దీంతో తెలుగు హీరోలతో వర్కౌట్ కావడం లేదని తమిళ్ స్టార్ హీరోలతో ప్రయత్నాలు చేశారట మురుగుదాస్ . కమల్‌తో పాటు రజినీకాంత్, విజయ్ కాంత్, థలపతి విజయ్ ఇలా పలువురు స్టార్ హీరోలకు గజిని కథను చెప్పారట. అందరూ ఈ కథను రిజెక్ట్ చేశారట.
ఈ క్రమంలో తన మొదటి సినిమాకు ఛాన్స్ ఇచ్చిన అజిత్ దగ్గరకు వెళ్ళారట మురుగుదాస్ . అజిత్‌కు కథ బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వెంటనే హీరోయిన్స్ గా ఆసీన్, శ్రీయలను, విలన్ గా ప్రకాష్ రాజ్ లను తీసుకొని సినిమాను స్టార్ట్ చేశాడట మురుగుదాస్ . అయితే సినిమా రెండు షెడ్యూల్ లు కంప్లీట్ అయ్యాక అజిత్ ఈ సినిమా చేయడం లేదని చెప్పారట.
దీంతో కత్త హీరోను వెతికే టైమ్ లో శ్రీయ, ప్రకాష్ రాజ్ డేట్స్ అయిపోయాట. అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న సూర్యకు ఈ కథను చెప్పాడట మురుగుదాస్ . సూర్య కథకు ప్లాట్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమాను మళ్లీ స్టార్ట్ చేశారట మురుగుదాస్ . శ్రీయ, ప్రకాష్ రాజ్ ప్లస్ లలో నయనతార, ప్రదీప్ రావత్ లను మురుగుదాస్ తీసుకున్నాడు.
2005 సెప్టెంబర్ 29న విడుదలైన గజిని సంచలన విజయం సాధించింది. సూర్యకు స్టార్ హీరో స్టేటస్‌ను తీసుకొచ్చింది. ఆ ఏడాదిలో 3వ హైయెస్ట్ గ్రాసర్‌గా గజిని నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు.