మరో 4 లక్షల కొత్త కొలువులు: కేటీఆర్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: రేవంత్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బేగ్.. షర్మిలకు హిజ్రాల వార్నింగ్.. హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం.. గవర్నర్ కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణలు.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

మరో 4 లక్షల కొలువులు: కేటీఆర్

రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే రంగాల్లో లైఫ్‌ సైన్సెస్‌ అత్యంత కీలకమని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీనోమ్‌ వ్యాలీలో ఇప్పటికే ఏర్పాటైన అంతర్జాతీయ స్థాయిఫార్మా పరిశ్రమలతో ఈ రంగం 4 లక్షల మందికి ఉపాధి కల్పించిందని.. వచ్చే ఐదేళ్లలో మరో 4 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్లుగా ఉన్న హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో.. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 20వ బయో ఏషియా సదస్సు జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆ సదస్సు గురించి, లైఫ్‌ సైన్సెస్‌ రంగం, ఫార్మా కంపెనీల పెట్టుబడులు, సంబంధిత అంశాల గురించి మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి: రేవంత్ రెడ్డి

తెలంగాణ తెచ్చినోడికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటర్లను కోరారు. తమకు అధికారం ఇస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు దండుపాళ్యం ముఠాగా తయారై దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర మంగళవారం వరంగల్‌లో సాగింది. హెడ్‌ పోస్టాఫీస్‌ సెంటర్‌లో జరిగిన సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బిల్లా-రంగాలుగా మారారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్ ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గతంలో మాదిరి సీటు తమకే కేటాయించి తమకు మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన ఎం ఐ.ఎం చేసిన అభ్యర్థన మేరకు, పార్టీ సీనియర్ల తో చర్చించిన మీదట…హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎం.ఐ.ఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

షర్మిలపై హిజ్రాల ఫైర్

మహబూబాబాద్ లో ఇటీవల నిర్వహించిన వైఎస్ఆర్టీపీ బహిరంగ సభలో వైయస్సార్ షర్మిల హిజ్రాల పేరుతో చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ ట్రాన్స్జెండర్లు ఆందోళన నిర్వహించారు. షర్మిల డాం డాం అంటూ నినాదాలు చేశారు. హిజ్రాల పేరుతో మాట్లాడిన షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. ఇంకా.. పరువు నష్టం దావా వెస్తామని హెచ్చరించారు.

సుద్దాల అశోక్ తేజకు పురస్కారం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అక్షయాన్‌ సారధ్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు బండారు దత్తాత్రేయ పంపకవి పురస్కారాన్ని ప్రదానం చేసి స్వర్ణకంకణాన్ని తొడిగి, శాలువాతో సత్కరించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. సుద్దాల అశోక్‌తేజ సాహిత్య సేవ ను ప్రశంసించారు.

ప్రారంభమైన యాద్రాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, విష్వక్సేన ఆరాధనతో అర్చకులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 21 నుండి మార్చి 3 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ 11 రోజులు భక్తులచే జరిపించే శాశ్వత పూజా కార్యక్రమాలను అధికారులు నిలిపివేశారు.

గవర్నర్ తమిళిసై కు క్షమాపణలు చెబుతా:

తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇన్నాళ్లు తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు తన తప్పును ఒప్పుకున్నారు. గవర్నర్‭ను క్షమాపణలు కోరుతూ లిఖితపూర్వకంగా లేఖ రాయనున్నట్లు తెలిపారు.

ఖదీర్ ఖాన్ మృతిపై హైకోర్టు ఆదేశాలు

మెదక్ జిల్లాకు చెందిన ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సిఎస్ శాంతికుమారి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి,డిజిపి, మెదక్ ఎస్‌పి,డిఎస్‌పి, స్టేషన్ ఎస్‌హెచ్‌ఒలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఖదీర్‌ఖాన్ మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టులో హాజరుపరిచిన 14 రోజులకు ఖదీర్ ఖాన్ మరణించారని అదనపు ఎజీ వాదనలు వినిపించారు. ఆయన మృతికి కారణాలపై విచారణ జరుపుతామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చ్ 14వ తేదీని వాయిదా వేసింది.

హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం

హైదరాబాద్ శివారుల్లో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు చేశారు. పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఫామ్ హౌస్లే అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడులకు దిగారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ ఫామ్ హౌజ్ లో పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఫాం హౌస్‌లో పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతానికి చెందిన ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ఈ ఐదుగురు విటులు యువతీని ఫామ్ హౌస్ కు తీసుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే యువతిని ప్రలోభ పెట్టి తీసుకు వచ్చారా? లేక వ్యభిచార చేయించేందుకు తీసుకువచ్చారా? అన్న విషయాలు ఇంకా తెలియల్సి ఉంది

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc