సెలబ్రెటీలు అన్న తర్వాత ఫిట్ గా, అందంగా ఉండేందుకు నిత్యం పలు ఆహార నియమాలు, ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలు తీసుకోవడం సాధారణమైన విషయమే. అందులో ముఖ్యంగా వారు తీసుకునే స్నాక్స్, ఫుడ్ ఐటెమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాల్చిన గింజలు, విత్తనాలు
సాధారణ గింజలు, విత్తనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తారలు, ప్రముఖులు తమ స్నాక్స్ లిస్ట్ లో చేర్చుకుని ఆరోగ్యంగా ఉండేందుకు పలు వ్యాయామాలను పాటిస్తారు. ఇవి రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికీ మంచివి. వీటిని ప్యాన్ మీద సన్నని మంట మీద వేయించి తీసుకోవడం ఉత్తమం.
పల్లీలు
నానబెట్టిన పల్లీలను ఉడికించి తినడం వల్ల మెరుగైన ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీనికి ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, వెల్లుల్లిని కూడా కలిపి తీసుకోవచ్చు.
పండ్ల ముక్కలు
పండ్లను సన్నని ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టండి. వాటిని భోజనానికి మధ్యలో తీసుకోండి. కాలానుగుణంగా పండ్లను తినడమే కాకుండా, తినే ముందు కడిగి తీసుకోవడం మర్చిపోవద్దు.
అరటి, వేరుశనగ వెన్న
ఈ కలయిక ఆరోగ్యకరమైనది. ఇది పొట్టను ఎక్కువ కాలం నిండుగా ఉంచేలా చేస్తుంది. పెద్ద మొత్తంలో వేరు శనగ వెన్నను తీసి, దానికి అరటిపండ్లను జోడించి తినండి.
రసాలు, స్మూతీస్
ఇంట్లో తయారు చేసిన జ్యూస్ లు, స్మూతీలు ఆరోగ్యకరమైనవి. ఇవి ఎల్లప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. ప్యాక్ చేసిన జ్యూస్ లలో చక్కెర ఎక్కువగా ఉన్నందున, వాటిని తీసుకోవడం మానుకుంటే మంచిది.
ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్
గోధుమ, వేరుశనగ పిండి లాంటి ఆరోగ్యకరమైన పదార్ధాలతో ఇంట్లో తయారుచేసే వేరుశనగ ఫ్రై, చక్లీ వంటి ఇతర రుచికరమైన స్నాక్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. స్నాక్స్ ను తయారు చేసేటప్పుడు ఉప్పు విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అది ఎంత తక్కువగా ఉంటే అంత ఆరోగ్యకరం.