శంకర్ ఆఫర్‌‌ను రిజెక్ట్ చేసిన అబ్బాస్.. ఇంతకీ అది ఏ సినిమా అంటే?

స్టార్ హీరో శంకర్ సినిమా ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా.. అందులోనూ హీరోగా కెరీర్ బిగినింగ్ లో.. నో ఛాన్స్ కదా.. కానీ అబ్బాస్ మాత్రం శంకర్ పిలిచి మరి ఆఫర్ ఇస్తే నో అనేశాడట. ఇంతకీ ఏం జరిగిందంటే.. కమల్ హాసన్‌‌తో భారతీయుడు చిత్రాన్ని తీసి సెన్సేషన్ డైరెక్టర్‌‌‌‌గా మారిన శంకర్.. ఆ తర్వాత అంతకుమించి సినిమాని తీయాలని అనుకున్నారు కానీ కుదరలేదు.

దీంతో తక్కువ బడ్జెట్ లో ఓ సినిమాకు ప్లాన్ చేశారు శంకర్.. అప్పుడెప్పుడో అనుకున్న ఓ మూవీ లైన్ శంకర్ కు తట్టింది. అదే జీన్స్.. ఓకే పోలికతో ఉన్న ఇద్దరు అబ్బాయిలు ఓకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్‌‌ని తీసుకొని విజువల్ వండర్‌‌గా జీన్స్ మూవీని తెరకెక్కించారు శంకర్.

అయితే ముందుగా ఈ సినిమాకి హీరోగా అబ్బాస్‌‌ని అనుకున్నారు శంకర్.. ప్రేమదేశం మూవీ సక్సెస్ కావడంతో యూత్ లో అబ్బాస్‌‌కు విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఈ కథకు అబ్బాస్‌‌ సరిగ్గా సరిపోతారని శంకర్ భావించారు. అందుకే అబ్బాస్ ను పిలిచి మరి ఆఫర్ చేశారట. కానీ ప్రేమదేశం మూవీ సక్సెస్ కావడంతో అబ్బాస్ ఫుల్ బిజీలో ఉన్నాడు.. దాదాపుగా ఓ పది సినిమాలకి కమిట్ అయ్యాడు. దీనితో శంకర్ ఆఫర్‌‌ని రిజెక్ట్ చేశాడు అబ్బాస్.

దీంతో అజిత్ తో ఈ చిత్రాన్ని చేయాలని శంకర్ అనుకుంటే కాల్షీట్ల కారణంగా అజిత్ కూడా ఈ మూవీని పక్కన పెట్టాడట అజిత్. చివరకు ఈ చిత్రం ప్రశాంత్ దగ్గరికి వచ్చి చేరింది. అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం మూవీ ఆఫర్ లను మిస్ చేసుకొని బాధపడుతున్న ప్రశాంత్‌‌కి ఇది మంచి ఆఫర్ కావడంతో అప్పటికే కమిట్ అయిన ఏడు సినిమాలని కాదనుకొని శంకర్‌‌కి డేట్స్ ఇచ్చాడట ప్రశాంత్.

ఇక ఈ సినిమాను తీయాలని అనుకున్నప్పుడే హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ ను తీసుకోవాలని శంకర్ ఫిక్స్ అయ్యారు. భారతీయుడు మూవీకి ముందుగా ఐశ్వర్యరాయ్ నే అనుకున్నారు శంకర్..అది మిస్ అయిన జీన్స్ మూవీతో వీరి కాంబినేషన్ సెట్ అయింది. జీన్స్ మూవీలో ఐశ్వర్యరాయ్ ని ఎనమిదో వింతగా చూపిస్తూ ప్రపంచంలోని ఏడు వింతలున్న ఏడు ప్రదేశాల్లో పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం అనే పాటను చిత్రీకరించారు శంకర్. ఈ పాట కోసం ఆయన ఆప్పట్లోనే మూడు కోట్లు ఖర్చు చేశారట శంకర్.

24 ఏప్రిల్ 1998 సంవత్సరం రిలీజైన జీన్స్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్ లో కంటే తెలుగులోనే ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here