వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతి.. 2001 తమిళంలో వచ్చిన ఆనందం సినిమాకి ఇది రీమేక్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన ఆర్. బి. చౌదరి నిర్మించగా, ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించారు. 18 ఫిబ్రవరి 2005లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. హీరోలు వెంకటేష్, శ్రీకాంత్ మధ్యలో వచ్చే ఎమోషన్స్ సీన్స్ ఆడియన్స్ ను కట్టిపడేశాయి.
అయితే ఈ సినిమాలో విష్ణు పాత్రను చేయడానికి ముందుగా హీరో శ్రీకాంత్ ఆసక్తిని చూపించలేదట. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు హీరో శ్రీకాంత్ బాపు దర్శకత్వంలో రాధాగోపాలం అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ సరసన స్నేహతో నటిస్తుంది. ఇందులో హీరోయిన్ గా చేసి, సంక్రాంతి మూవీలో ఆమెకి మరిదిగా కనిపిస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అని శ్రీకాంత్ సందేహించరట శ్రీకాంత్. దర్శకుడు మాత్రం ఈ పాత్ర నీకు మంచి పేరు తెస్తుందని చెప్పారట. చిత్ర నిర్మాత ఆర్. బి. చౌదరి కూడా బలవంతం చేయడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడట శ్రీకాంత్.
అయితే శ్రీకాంత్ కంటే ముందుగా ఈ పాత్రకు సీనియర్ హీరో వడ్డే నవీన్ ను అనుకున్నారట దర్శకుడు ముప్పలనేని శివ. సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ఆ పాత్రకి వడ్డే నవీన్ ని అనుకున్నారట. పేపర్ పైన కూడా విష్ణు పాత్రకి వడ్డే నవీన్ అనే రాసుకున్నారట.. ఈ విషయాన్ని ముప్పలనేని శివ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫైనల్ గా ఆ పాత్ర కోసం శ్రీకాంత్ ను తీసుకున్నారు. ఇక ఆ పాత్ర శ్రీకాంత్ కి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా శ్రీకాంత్, ముప్పలనేని శివ కాంబినేషన్ లో తాజ్ మహల్, గిల్లికజ్జాలు, శుభలేఖలు చిత్రాలు వచ్చాయి.