సుమంత్ వదిలేసిన సినిమాల గురించి తెలిస్తే వామ్మె అనాల్సిందే.

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో సుమంత్. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్… కెరీర్ మొదట్లో అద్భుతమైన అవకాశాలను చేజార్చుకున్నాడు. ఈయన వదిలేసిన సినిమాల గురించి తెలిస్తే వామ్మె అనాల్సిందే. ఎందుకంటే సుమంత్ మిస్ చేసుకున్న సినిమాలతో కొందరు హీరోల కెరీర్స్ సెట్ అయిపోయాయి. మరి సుమంత్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో చూద్దాం..

సుమంత్ మిస్ చేసుకున్న తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ నువ్వే కావాలి. ఈ సినిమాను ముందగా సుమంత్ కే చెప్పారట. అయితే అప్పటికే వరుసగా నాలుగు సినిమాలకు సుమంత్ కమిట్ అవ్వడంతో దీనిని పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత పవన్ దగ్గరికి ఈ కథ వెళ్లింది. వాళ్లు మిస్ చేసుకున్నాకే తరుణ్ దగ్గరికి వెళ్లింది. ఆ తరువాత నువ్వే కావాలి డైరెక్టర్ విజయభాస్కర్ తో క్లాస్ మేట్స్ అనే సినిమాను చేశాడు సుమంత్

సుమంత్ చేజార్చుకున్న మరో బ్లాక్ బస్టర్ సినిమా తొలిప్రేమ. కరుణాకరణ్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమయ్యాడు. అయితే ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు ఆ తరువాత కరుణాకరణ్ తో వెంటనే యవకుడు అనే సినిమాను చేశాడు సుమంత్. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, దేశముదురు చిత్రాల కథలను కూడా ముందు సుమంత్ కే చెప్పాడట పూరీ. కానీ అది సుమంత్ కు నచ్చలేదట.

సుమంత్ చేజార్చుకున్న మరో అద్భుతమైన సినిమా నువ్వు వస్తావని. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ముందు ఆర్ బీ చౌదరి సుమంత్ హీరోగానే రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ అప్పుడున్న ఇమేజ్ కారణంగా ఈ సినిమా చేయలేకపోయాడు సుమంత్. ఇదే కథను నాగార్జునతో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు ఆర్ బీ చౌదరి బ్యానర్ లో స్నేహమంటే ఇదేరా సినిమా చేసాడు సుమంత్. కానీ అది ఫ్లాప్ అయింది.

మనసంతా నువ్వే సినిమాకు ముందుగా హీరో మహేష్ బాబును అనుకున్నారు . అయితే కథ సాఫ్ట్ గా ఉందని మహేష్ రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత సుమంత్ కు వినిపిస్తే అతని కూడా అంతగా నచ్చలేదు. దీంతో ఉదయ్ కిరణ్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు విఎన్ ఆదిత్య. ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు ఆ తరువాత విఎన్ ఆదిత్య తో రాజ్అనే సినిమాను చేశాడు సుమంత్. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here