బాహుబలి సినిమాకే కాకుండా ఈ సినిమాకు కూడా కండీషన్లు పెట్టిన శ్రీదేవి

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ మూవీ బాహుబలి. ప్రభాస్,రానా,అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా టాలీవుడ్ సినిమా స్థాయినే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్ళింది.

అయితే ఈ సినిమాలోని ప్రతి పాత్ర ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా శివగామి పాత్ర సినిమాకే బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఆ పాత్రకు ముందుగా హీరోయిన్ శ్రీదేవిని అనుకున్నారట మేకర్స్. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు.శివగామి పాత్రను చేయడానికి శ్రీదేవి కొన్ని కండిషన్లు పెట్టి మిస్ చేసుకున్నారట.సినిమాలో నటించడానికి అరు కోట్ల రెమ్యునరేషన్ తో పాటుగా హిందీ సినిమా రైట్స్ ఇవ్వాలని శ్రీదేవి డిమాండ్ చేసినట్లుగా రాజమౌళి వెల్లడించారు.

దీనితో ఆమెను పక్కన పెట్టి ఆ పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాతో రమ్యకృష్ణ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే కొండవీటి దొంగ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా శ్రీదేవిని అనుకున్నారట మేకర్స్. అయితే శ్రీదేవి ఇలాగే కండీషన్లు పెట్టిందట.

టైటిల్లో చిరంజీవి పేరుతో ‘కొండవీటి దొంగ’ ఎలా వస్తుందో.. అలాగే తన పాత్ర కూడా తెలిసేలా ‘కొండవీటి రాణి’ లాంటి పేరు సినిమాకు టైటిల్ కు జతచేయాలని అన్నారట.అంతేకాకుండా తన పాత్ర అడవిలో హీరో వెంట పడినట్లు కాకుండా, హీరోనే తన వెంట తిరిగేలా ఉండాలని శ్రీదేవి అన్నారట. దీంతో మేకర్స్ ఆమెను పక్కన పెట్టారట.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here