ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కోసం… ‘మందార’

మందార పువ్వు.. చాలా మందికి తెలిసిన సహజ ఆయుర్వేద ఔషధం. దీన్ని జుట్టు పెరుగుదలకే కాకుండా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలకూ ఉపయోగకారిగా పనిచేస్తుంది. కేవలం మందార పువ్వే కాదు.. దాని రేకులు, కాండం, కేసరాలు, ఇతర భాగాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

జుట్టు పెరుగుదల

మందారలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అమైనో ఆమ్లాలు ఉంటాయి. మందారలో ఉండే అమైనో ఆమ్లాలు ఉత్పత్తి చేసే కెరాటిన్ జుట్టు నల్లగా మారేందుకు, చిట్లిపోకుండా కాపాడుతుంది. అందువల్ల, జుట్టుకు మందారను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు.

చుండ్రు

చుండ్రు సమస్యలకు మందార కీలక ఔషధంగా పని చేస్తుంది. పువ్వు రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది.నూనె స్రావాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది. ఈ సమస్యకు మందార ఆకులను కూడా ఉపయోగించవచ్చు. ఇది తల, జుట్టు pH స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.

హెయిర్ ఆయిల్

మందార పువ్వును ఉపయోగించి తయారుచేసిన నూనె.. స్కాల్ప్ కు పట్టించి.. మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. హైబిస్కస్ హెయిర్ ఆయిల్ స్కాల్ప్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

షాంపూ/ హెయిర్ క్లెన్సర్

మందార నురుగును షాంపూగా కూడా ఉపయోగించవచ్చు. దాని పువ్వు లేదా ఆకులను షాంపూలలో చేర్చవచ్చు. ఇది జుట్టును శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

హెయిర్ మాస్క్

మందార పువ్వులు, ఆకులను హెయిర్ మాస్క్‌లు గానూ ఉపయోగించవచ్చు. ఇది జుట్టుకు మెరుపు, నిగారింపును ఇస్తుంది. లేదా దీన్ని ఉసిరి, పెరుగు, కలబందతో కలిపి కూడా జుట్టుకు పట్టించవచ్చు.

వీటితో పాటు మందార జుట్టుకు కండీషనర్ గానూ పనిచేస్తుంది. దీని పువ్వు, ఆకులు వంటి ఇతర భాగాలు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు, నిగారింపు తెచ్చేందుకు సహకరిస్తాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here