Homelatestరాజ్​భవన్​లోనే వేడుకలు.. భారీగా ఐపీఎస్​ల బదిలీలు.. పద్మ అవార్డుల్లో మనవాళ్లు.. ఈరోజు టాప్​ న్యూస్​

రాజ్​భవన్​లోనే వేడుకలు.. భారీగా ఐపీఎస్​ల బదిలీలు.. పద్మ అవార్డుల్లో మనవాళ్లు.. ఈరోజు టాప్​ న్యూస్​

రాజ్​భవన్​లోనే రిపబ్లిక్​ డే వేడుకలు

ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే వేడుకలు రాజ్ భవన్​లోనే జరుగుతున్నాయి. రిపబ్లిక్​ డే వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించకపోవటంపై దాఖలైన పిటిషన్​పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గణతంత్ర దినోత్సవ నిర్వహణపై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరేడ్ తో కూడిన వేడుకలు నిర్వహించాలని, ప్రజలను వేడుకలకు అనుమతించాలని గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హడావుడిగా రాజ్​భవన్​లోనే పేరేడ్​ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతకు ముందు హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కొవిడ్ కారణంగా పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించడం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కోవిడ్ ప్రోటోకాల్ జీవో కోర్టుకు ఎందుకు సమర్పించలేదని కోర్టు ఏజీని ప్రశ్నించింది. దేశంలో 1950 నుంచి గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయని.. పెరేడ్ తప్పకుండా నిర్వహించాలని హైకోర్టు సూచించింది. గురువారం ఉదయం 7 గంటలకు రాజ్​భవన్​లో రిపబ్లిక్​ డే వేడుకలు మొదలయ్యాయి.

భారీగా ఐపీఎస్​ బదిలీలు

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 51 మంది ఐపీఎస్​లు, 40 మంది నాన్‌ కేడర్‌ ఆఫీసర్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఐపీఎ్‌సల బదిలీలు జరగడం తెలంగాణలో ఇదే మొదటిసారి. రాచకొండ జాయింట్‌ సీపీగా సత్యనారాయణ, రామగుండం సీపీగా రమా రాజేశ్వరి, రాచకొండ ట్రాఫిక్‌కు అభిషేక్‌ మహంతి, ఇంటెలిజెన్స్‌కు విజయ్‌కుమార్‌, ఏసీబీ జేడీగా చేతన మైలాబత్తుల, సైబర్‌ సెక్యూరిటీకి విశ్వజిత్‌ కాంపాటి, రఘువీర్‌, నార్కోటిక్స్‌కు సునీత, గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా, మహబూబ్‌నగర్‌, గద్వాల, జగిత్యాల ఎస్పీలుగా నాన్‌ కేడర్‌ అధికారులు నియమితులయ్యారు.

పద్మ అవార్డుల్లో చినజీయర్​​, కీరవాణి

రిపబ్లిక్‌డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఆరుగురికి పద్మవిభూషణ్‌, తొమ్మిది మందికి పద్మభూషణ్‌ ప్రకటించింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ఉన్నారు. గత ఏడాది దివంగతుడైన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌కు కేంద్రం పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ, తబలా విద్వాంసుడు జాకిర్‌ హుస్సేన్‌, దివంగత వాస్తు శాస్త్రవేత్త బాలకృష్ణ దోషి, ప్రముఖ శిశు వైద్య నిపుణుడు, ఓఆర్‌ఎస్​ కనిపెట్టిన దివంగత వైద్యుడు దిలాప్‌ మహాలానాబిస్‌, గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్‌ వర్ధన్‌లకు పద్మ విభూషణ్‌ లభించింది. పద్మ భూషణ్‌ అవార్డులకు ఎంపికైన 9 మందిలో గాయని వాణీజయరాం, ప్రముఖ సాహితీవేత్త బైరప్ప, పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, ప్రముఖ నేపథ్య గాయని సుమన్‌ కళ్యాణ్‌పూర్‌, ప్రముఖ భాషావేత్త కపిల్‌ కపూర్‌, ప్రముఖ సామాజికవేత్త సుధామూర్తి ఉన్నారు. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక వేత్తలు చినజీయర్‌ స్వామి, కమలేశ్‌ డి పటేల్‌ పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి(ఆంధ్రప్రదేశ్‌)ని పద్మశ్రీ వరించింది. తెలంగాణ నుంచి ప్రముఖ శాస్త్రవేత్త మోదడుగు విజయ్‌ గుప్తా, ప్రముఖ వైద్యుడు పసుపులేటి హన్మంతరావు, ప్రముఖ భాషావేత్త బి.రామకృష్ణా రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ సాంకేతిక ఇంజనీర్లు గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వర రావు, ఏటికొప్పాకకు చెందిన కొయ్యబొమ్మల కళాకారుడు సీవీ రాజు, గుంటూరుకు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసుడు కోట సచ్చిదానంద శాస్త్రి, ప్రముఖ సామాజికవేత్త సంకురాత్రి చంద్రశేఖర్‌, విద్యావేత్త ప్రకాశ్‌ చంద్రసూద్‌ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

15 మందికి పోలీస్​ పతకాలు

రిపబ్లిక్​ డే సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీసు పతకాలకు తెలంగాణ నుంచి 15 మంది ఎంపికయ్యారు. హైదరాబాద్‌ అదనపు డీజీపీ అనిల్‌ కుమార్‌, 12వ బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌ రామకృష్ణ రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకానికి ఎంపిక కాగా, మరో 13 మందికి పోలీసు మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ లభించాయి. కేంద్రీయ సంస్థల్లో పనిచేస్తున్న పలువురు తెలుగు పోలీసులకూ పతకాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 901 మందిని కేంద్ర హోంశాఖ పోలీసు పతకాలకు ఎంపిక చేసింది. బుధవారం ఈ జాబితా విడుదల చేసింది. ఇందులో 140 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలెంట్రీ, 93 మందికి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం, 668 మందికి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌ ప్రకటించింది. గ్యాలెంట్రీ పతకాలు దక్కించుకున్న 140 మందిలో 48 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు ఉన్నారు.

జగిత్యాల మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ రాజీనామా

జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్ కుమార్ పెత్తనం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశాడని, తన పదవితో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చాలా చిన్నది అంటూ చాలాసార్లు  సంజయ్ అవమానించాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​కు చెందిన ఛైర్మన్​ రాజీనామా చేయటం ఆ పార్టీలో విభేదాలను బయటపెట్టింది.

రాజ్యాంగాన్ని కించపరుస్తున్న కేసీఆర్​: కిషన్​రెడ్డి

సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించకపోవడం కేసీఆర్ రాజరికానికి నిదర్శనమని అన్నారు. గతంలో  ఏ ముఖ్యమంత్రి కూడా  ఇలా వ్యవహారించలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం కారణంగా తెలంగాణ పరువుపోతుందన్నారు. కేసీఆర్ హయాంలో సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేసేందుకు హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అన్ని రాష్ట్రాల్లో సంప్రదాయంగా వస్తోందని.. కేసీఆర్ సర్కారు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. 

అజ్మీర్​ చాదర్​ పంపిన సీఎం కేసీఆర్​

అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపే ‘చాదర్’ ను సీఎం కేసీఆర్ ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్ లో ముస్లిం మతపెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్ ను వక్ఫ్ బోర్డు అధికారులకు అందచేశారు. వారు దాన్ని అజ్మీర్ దర్గాలో సమర్పించనున్నారు. రాష్ట్రం మరింత ప్రగతి పథంలో సాగాలని,రాష్ట్ర, దేశ ప్రజలందరూ ఐకమత్యంతో జీవించేలా దీవించాలని అల్లాను ప్రార్థించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc