తెలంగాణ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ జిల్లా, ఐటీ
రంగంలో విశ్వవిఖ్యాత నగరంగా పేరు గాంచింది. హైదరాబాద్
మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉన్నది. వైశాల్యం పరంగా రాష్ట్రంలో
అతిచిన్నదైనప్పటికీ, అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా. నిజానికి ఇది నగర జిల్లా. దీనికి
జిల్లా ప్రధాన కేంద్రమంటూ ఉండదు. పాత మునిసిపల్ కార్పొరేషన్
ఆఫ్ హైదరాబాద్ ప్రాంతం ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది.
చరిత్ర: హైదరాబాద్ జిల్లాను 1948లో పోలీసు చర్య తర్వాత
ఏర్పాటు చేశారు. నాటి “అత్రాఫ్-ఎ-బల్దా” జిల్లా, బఘత్ జిల్లాలను
విలీనం చేయడం ద్వారా ఈ జిల్లా ఏర్పాటైంది. నాటి హైదరాబాద్
స్టేట్ కు అత్రాఫ్-ఎ-బల్దా రాజధానిగా ఉండేది. నిజాం పాలనా
కాలంలో ఇందులో మొత్తం ఏడు తాలూకాలుండేవి. వీటి నుంచి వచ్చే
ఆదాయం నిజాం నవాబుల ఖర్చులకోసం వినియోగించేవారు. దీన్నే
“సర్ఫ్-ఇ-ఖాస్” అని వ్యవహరించేవారు. ముందు బాటలు
.
భౌగోళికంగా 217 చదరపు కిలోమీటర్ల (84 చదరపు మైళ్లు) విస్తీర్ణం కలిగిన
హైదరాబాద్ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్,
సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, ఉస్మానియా యూనివర్సిటీలు
ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 16 పాలనా ప్రాంతాలు ఉండగా వీటిని మండలాలుగా
వ్యవహరిస్తున్నారు.
జనాభా: 2011 జనగణన ప్రకారం హైదరాబాద్ జిల్లా జనాభా
39,43,323. ఇక్కడ హిందువులు (51.89%), ముస్లింలు
(43.45%), క్రైస్తవులు (2.22%), జైనులు (0.5%), సిక్కులు
(0.29%), బౌద్ధులు (0.03%) ఉన్నారు. కాగా 1.58 శాతం మంది
తాము ఏ మతానికి చెందిందీ వెల్లడించలేదు. ఇన్ని మతాల ప్రజలు
సామరస్యంగా ఉన్న హైదరాబాదు లైబీరియా, యునైటెడ్ స్టేట్స్ లోని
ఓరిగాన్ రాష్ట్రంతోను పోల్చవచ్చు.
జిల్లాలో ప్రతి చదరపు కిలోమీటరుకు 18,172 మంది నివసిస్తున్నారు.
జిల్లాలో 2001-11 మధ్యకాలంలో జనాభా పెరుగుదల 4.71% నమోదైంది.
జిల్లాలో మొత్తం అక్షరాస్యత 83.25 శాతం. హైదరాబాద్ లో
అత్యధిక జనాభా గల మండలం బహదూర్‌పూర్.
ఇండోఅరబిక్ – పర్షియన్ వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి హైదరాబాద్ కట్టడాలు
ప్రతీక. ఒక్కో కట్టడానిది ఒక్కో చారిత్రక నేపథ్యం. ప్రపంచంలో ఎక్కడా లేని
నిర్మాణశైలి వీటి సొంతం. గోల్కొండ కోట, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, అసెంబ్లీ,
చౌమహల్లా ప్యాలెస్, కింగ్ కోరి, పురానా హవేలీ, ఫలక్ నుమా ప్యాలెస్
కట్టడాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు. మక్కా మసీదు, లాల్ దర్వాజా,
ఉజ్జయిని మహంకాళి దేవాలయాలు పండగలకు ప్రధాన ఆకర్షణ.
ప్రపంచ స్థాయి విద్యా, వైద్య కేంద్రంగా ప్రఖ్యాతి చెందింది.