స్టార్ హీరోల సరసన నటించాలన్న కోరిక ప్రతి ఒక్క హీరోయిన్ కు ఉండడం సహజమే. కానీ అదే స్టార్ హీరోకు చెల్లెలుగా నటించాలంటే మాత్రం చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేస్తారు కానీ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా ఏడ్చేసిందట. వివి వినాయక్ డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం చెన్నకేశవరెడ్డి. బెల్లంకొండ సురేష్ చిత్రాన్ని నిర్మించగా పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు. మణిశర్మ సంగీతం అందించాడు.
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కటం.. బాలయ్య ద్విపాత్రాభినయం చేయడంతో సినిమాపై రిలీజ్‌కు ముందు ఆకాశాన్ని టచ్ చేసే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలయ్య కొడుకు పాత్రకు జోడిగా… శ్రీయ తండ్రి పాత్రకు జోడిగా సీనియర్ హీరోయిన్ టబు నటించారు. బాలయ్యకు సోదరిగా దేవయాని నటించింది. అయితే ముందుగా సీనియర్ హీరోయిన్ టబు పాత్రకు హీరోయిన్ సౌందర్య అనుకున్నారట వివి వినాయక్. కానీ ఓల్డ్ బాలయ్యకు వైఫ్ గా నటించలేనని సౌందర్య రిజెక్ట్ చేశారంట.
ఇక బాలకృష్ణ చెల్లెలి పాత్రలో సీనియర్ హీరోయిన్ దేవయాని నటించి మెప్పించారు. అయితే ఈ పాత్రకు ముందుగా హీరోయిన్ లయను అనుకున్నారట వివి వినాయక్. ఆమెకు వెళ్లి కథ వినిపిస్తే ఆమె బోరున ఏడ్చేసిందట.తెలుగు హీరోయిన్ అంటే ఎందుకు ? అంత చులకనగా చూస్తారు మేము హీరోయిన్లుగా పనికిరామా ? చెల్లెలు పాత్రలకే పరిమితం చేస్తారా అంటూ వెంటనే కన్నీళ్లు పెట్టుకుందట. అయితే వినాయక్ మరోలా అనుకోవద్దని లయకు సారీ చెప్పారట. ఆ తర్వాత ఈ పాత్రకు తమిళనటి దేవయానిని అడిగిన వెంటనే ఆమె ఓకే చెప్పేసిందిట.
ఇక లయ, బాలకృష్ణ కాంబినేషన్లో విజయేంద్ర వర్మ చిత్రం తెరకెక్కింది. అంకిత, సంగీత లో మరో హీరోయిన్ గా నటించారు.కానీ ఈ చిత్రం వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది.