ఫిమేల్ సింగర్ లేని పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ఏంటో తెలుసా?

ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తొలిప్రేమ. ఈ సినిమా ఆయనకు తొలిచిత్రం. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా ఆయన సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది , పవన్ కి చెల్లెలిగా వాసుకి కీలక పాత్ర పోషించింది. వేణుమాధవ్, అలీ, రవిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవా సంగీతం అందించిన ఈ సినిమా 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇది పవన్ కళ్యాణ్ కు నాలుగో చిత్రం కావడం విశేషం.

అయితే ముందుగా ఈ సినిమాకు హీరోగా సుమంత్ ను అనుకున్నారు మేకర్స్. కానీ సుమంత్ ఎందుకో ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ఈ కథ పవన్ వద్దకు వెళ్లింది. దేవా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇందులో అయిదు పాటలు ఉండగా ఒక్క ఫిమేల్ సింగర్ లేకపోవడం గమనార్హం. భువన చంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. సిరివెన్నెల రాసిన పాటలను ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. 1998 ఏడాదికిగాను బెస్ట్ తెలుగు మూవీగా తొలి ప్రేమ నేష‌న‌ల్ అవార్డును అందుకున్న‌ది. ఆరు నంది అవార్డుల‌ను ద‌క్కించుకొంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ వారానికి ఒక‌టి ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. అందులో భాగంగా ఈ ఎవ‌ర్‌గ్రీన్ ల‌వ్‌స్టోరీ మ‌రో సారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. తొలి ప్రేమ సినిమాను 2023 జూన్ 30న రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. తొలిప్రేమ రిలీజై ఇర‌వై ఐదేళ్లు గ‌డిచినా సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు.. 4కే టెక్నాల‌జీలో తొలిప్రేమ‌ను రీ రిలీజ్ చేయ‌నున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here