సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 7G బృందావన్ కాలనీ. 2004 లో రిలీజైన ఈ చిత్రం ప్రేమకథల్లో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. తాను చదువుకున్న రోజుల్లో ఓ పంజాబీ అమ్మాయితో జరిపిన లవ్ ట్రాక్ నే సినిమాగా మలిచారు సెల్వరాఘవన్. 70 శాతం తన రియల్ స్టోరీతోనే సినిమాను తెరకెక్కి్ంచారు సెల్వరాఘవన్.
ముందుగా మాధవన్ తో ఈ సినిమాను చేయాలని సెల్వరాఘవన్ అనుకున్నారు కానీ బోల్డ్ కంటెంట్ ఉండడంతో మాధవన్ రిజెక్ట్ చేసాడు. ఆ తరువాత సిద్ధార్ధ్ ను అనుకుంటే,డేట్స్ ఖాళీలేదు. దీంతో రత్నం కొడుకు రవికృష్ణను చూసిన సెల్వరాఘవన్ అతన్ని హీరోగా పెట్టి ఈ సినిమాను చేయాలని అనుకున్నారు.ఫోటో టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. హీరోయిన్ గా జెనీలియాకు అనుకున్నారు ఆ తరువాత తెలుగు అమ్మాయి స్వాతిని ఫైనల్ చేశారు.
అయితే స్టోరీలో హీరోయిన్ పంజాబీ అమ్మాయి కావడంతో స్వాతిని పక్కన పెట్టి సోనియాఅగర్వాల్ ని సెలక్ట్ చేసారు. అందుకే ఆడవారి మాటలకే అర్థాలే వేరులే చిత్రంలో స్వాతికి మంచి రోల్ ఇచ్చారు సెల్వరాఘవన్.
తమిళ వెర్షన్ లో 92 స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం రెండో రోజే 118 ప్రింట్లకు చేరుకుంది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం దాదాపు రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని రాబట్టింది. ఇక తెలుగు వెర్షన్ 35 స్క్రీన్‌లలో రిలీజైన ఈ సినిమా రెండో రోజు 80 ప్రింట్‌లకు చేరుకుంది. ఈ చిత్రాన్ని బెంగాలీలోకి ప్రేమ్ అమర్ ( 2009), కన్నడలో గిల్లి (2009), ఒడియాలో బలుంగా టోకా (2011 ) హిందీలో మలాల్ (2019) గా రిమేక్ చేశారు.