సోయా పాలు
సోయా పాలు ఆవు పాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలలో ఒకటి. వీటిలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.
ఓట్స్ పాలు
ఓట్స్ మిల్క్ అధిక పోషకాలుంటాయి. ఇవి సహజమైన తీపిని కలిగి ఉంటాయి. ఇది కరిగే ఫైబర్ కారణంగా ఆకృతిలో కొంచెం క్రిమీయర్ గా ఉంటుంది. వీటిలో విటమిన్ బి 12. ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ డి, ఎ ఉంటాయి.
బాదం పాలు
తియ్యని బాదం పాలు కూడా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలలో ఒకటి. వీటికి చక్కెర జోడించకపోవడం ఉత్తమం. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.
కొబ్బరి పాలు
కొబ్బరి పాలు సహజమైనవి. భారతీయ గృహాలలో పాక ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇతర పాల కంటే ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.
జనపనార పాలు
ఆవు పాలకు మరొక శాకాహారి ప్రత్యామ్నాయం జనపనార పాలు. వీటికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతూ వస్తోంది.
బియ్యం పాలు
బ్రౌన్ రైస్ ను ఈ పాలను తయారు చేస్తారు. ఇందులో కొవ్వుగా తక్కువగా, తీపి ఎక్కువగా ఉంటుంది. సహజ రూపంలో పిండి పదార్ధాలు ఈ పాలల్లో ఉన్నందున ఫోరిఫైడ్ రైస్ ను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యతనివ్వడం ఉత్తమం.