HomedistrictsJANGAON DISTRICT జనగాం జిల్లా

JANGAON DISTRICT జనగాం జిల్లా

పూర్వపు వరంగల్ జిల్లా, నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడగొట్టి జనగామ జిల్లాగా ఏర్పాటు చేశారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ మరియు
మహబూబాబాద్ జిల్లాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి.
జిల్లా మొత్తం 2,115.72 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. 2016 అక్టోబర్ 11న జనగామ జిల్లా ఏర్పాటైనది. వరంగల్ జిల్లాను మొత్తం ఐదు జిల్లాలుగా విడగొట్టారు. ఇవి వరుసగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు. మద్దూరు, చేర్యాల, కొత్తగా ఏర్పాటైన కొమరవెల్లి మండలాలను మినహాయించి, పాత జనగామ రెవెన్యూ డివిజన్‌లోని ప్రాంతాలలోనే జిల్లాను ఏర్పాటు చేశారు. పై మూడు
మండలాలను కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లాకు బదలాయించారు. వరంగల్ రెవెన్యూ డివిజన్ లోని ఘనపూర్, జఫర్లు, నల్లగొండ జిల్లాకు చెందిన గుండాలను జనగాం జిల్లాలో కలిపారు. ఈ జిల్లాలోనే
కొలనుపాక జైన క్షేత్రం కలదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా మొత్తం జనాభా 5,66,376

జనగామ జిల్లా ఉష్ణమండల ప్రాంతం. ఇక్కడ సగటున మే నెలలో 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక డిసెంబర్ నెలలో సగటున 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటాయి.

జిల్లా ప్రత్యేకతలు : తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రంగా, రాజకీయ, సామాజిక ఉద్యమాల పోతుగడ్డగా జనగామ పేరుగాంచింది. ఓరుగల్లు తర్వాత విద్యా కేంద్రం. జనగామ ఒకప్పుడు జైనుల ప్రాబల్యం కలిగిన ప్రాంతం. తెలంగాణలోనే అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే డివిజన్. రోడ్డు, రైల్వేల ప్రధాన రవాణా మార్గాలు. దేవాదుల,
ఎస్సారెస్పీలతోబాటు బయ్యన్న రిజర్వాయర్, స్టేషన్‌ ఘన్పూ​ర్ జలాశయం సాగునీరు అందిస్తున్నాయి.

  • పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి. జీడికల్ వీరాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలు ప్రసిద్ధిగాంచినవి. జిల్లాలోని పెంబర్తి లోహ హస్తకళలో ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది.
  • మహాకవి బమ్మెర పోతన జన్మస్థలం బమ్మెర, ‘కవి పాల్కురికి సోమనాథుడి స్వగ్రామం పాలకుర్తి ఈ జిల్లాలోనే ఉన్నాయి.
  • పోచంపల్లి రకం పట్టుచీరలను జనగామ జిల్లాలోని జనగామ, లింగాలఘణపురం మండలాల్లోనే తయారు చేస్తున్నారు.
  • దక్కన్ పీఠభూమిలో ఎత్తయిన ప్రాంతం సోలామైల్ ఇక్కడే ఉంది.
  • సాగునీటి ప్రాజెక్టులు: లింగాలఘనపురం, నవాబ్ పేట, రఘునాథపల్లి, అశ్వరావుపల్లి, స్టేషన్ ఘన్పూర్, బొమ్మకూరు, గండి రామారం, కర్నెబోయిగూడెం రిజర్వాయర్లు,
  • సర్దార్ సర్వాయి పాపన్నకోట రఘునాథపల్లి మండలంలోని ఖిలాసాపూర్​లో ఉంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc