జోగులాంబ గద్వాల మొత్తం 2,583 చదరపు కిలోమీటర్ల
విస్తీర్ణం కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా
6,09,990. .జిల్లా కేవలం ఒకే ఒక గద్వాల రెవెన్యూ డివిజనను కలిగి ,
ఉంది. మొత్తం 12 మండలాలుగా విభజితమైంది. అష్టాదశ శక్తి పీఠాల్లో
ఒకటిగా భాసిల్లే జోగులాంబ దేవాలయం అలంపూర్లో ఉంది. ఇది
తుంగ భద్ర, కృష్ణానదుల సంగమ ప్రదేశం. దీన్నే దక్షిణ కాశీగా, నవ
బ్రహ్మేశ్వరతీర్ధంగా కూడా వ్యవహరిస్తారు. అలంపూర్ ను శ్రీశైలానికి
ముఖ ద్వారంగా పరిగణిస్తారు. ఇక్కడే నవబ్రహ్మ ఆలయం కూడా
ఉన్నది. గద్వాల్ పట్టణం చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది.
జిల్లా ప్రత్యేకతలు: కృష్ణానదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు అయిన జూరాల
ప్రాజెక్టు దరూర్ మండలంలో కలదు.
రాష్ట్రంలో మొదటి సోలార్ పవర్ పార్కును ఈ జిల్లాలోనే ఏర్పాటు చేయడం
జరిగింది. జోగులాంబ ప్రాంతాన్ని “లాండ్ ఆఫ్ టెంపుల్స్”గా
పిలుస్తారు. షెడ్యూల్డ్ తెగల జనాభా అతి తక్కువగా ఉన్న జిల్లా కేవలం
9,376 మంది మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాలో ప్రముఖమైన
దేవాలయాలు గలవు. బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం,
చింతరేవుల ఆంజనేయస్వామి మరియు సంగమేశ్వరాలయం, గద్వాల
జాతర మరియు మఱ్ఱగల్ జాతరలు చెప్పుకోదగినవి.
- పర్యాటకం: అలంపూర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి
ఆలయాలు, బీచుపల్లి ఆంజనేయస్వామి, చింతరేవుల ఆంజనేయ
స్వామి, మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, గద్వాల •
జమ్మిచేడు జములమ్మ, జూరాల ప్రాజెక్టు, గద్వాల కోట,
నిజాంకొండ. - రైల్వే లైను: గుంతకల్ డివిజన్లో గద్వాల రైల్వే స్టేషన్ జంక్షన్ గా
ఉంది. గద్వాల-రాయచూర్ మధ్య 55 కి.మీ. రైల్వేలైన్. - తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతులు
కలగలిసిన జిల్లా గద్వాల. కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహాక
ప్రాంతంలో విస్తరించి నడిగడ్డగా పేరొందింది.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదైన జోగులాంబ క్షేత్రం కొలువైన
అలంపూర్ ఈ జిల్లాలోనే కొలువైంది. బీచుపల్లి ఆంజనేయస్వామి
ఆలయం ఖ్యాతి పొందింది. గద్వాల సంస్థానానికి ఎంతో
ప్రాముఖ్యత ఉంది. గద్వాల చేనేత చీరల ఖ్యాతి జగద్విదితం,
కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు అయిన జూరాల
ప్రాజెక్టు ధరూరు మండలంలో ఉంది. నెట్టెంపాడు, జూరాలకు
సాగునీరు అందుతున్నాయి. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఏటా
200 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తవుతోంది. - సాగునీటి ప్రాజెక్టులు: జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల,
తుమ్మిళ్ల, గట్టు ప్రతిపాదిత ఎత్తపోతల పథకాలు