KAMAREDDY DISTRICT కామారెడ్డి జిల్లా

కామారెడ్డి కొత్తగా ఏర్పడిన జిల్లా. పూర్వపు నిజామాబాద్​ నుంచి విడివడి కొత్తగా
ఏర్పడింది. 2011 జనగణన ప్రకారం కామారెడ్డి జనాభా 9,72,625. వీరిలో
పురుషులు 4,78,389 కాగా, 4,94,236 మంది స్త్రీలు. అదే 2001
జనగణన ప్రకారం కామారెడ్డి మొత్తం జనాభా 8,79,373 కాగా వీరిలో
4,38,634 మంది పురుషులు, 4,40,739 మంది స్త్రీలు. 2001 జనాభా
లెక్కలతో పోలిస్తే, ఈ దశాబ్ద కాలంలో పెరిగిన జనాభా శాతం 8. 8.

2011 జనాభా లెక్కల ప్రకారం కామారెడ్డి జనాభా సాంద్రత
చదరపు కిలోమీటరుకు 262. పురుషుల అక్షరాస్యత 67.4 శాతం
కాగా స్త్రీలల్లో ఇది 46. 13 శాతం మాత్రమే. జిల్లాలో లింగ
నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,033 మంది మహిళలు
ఉన్నారు. అదే 2001లో 1004గా నమోదైంది. 0-6 సంవత్సరాల
వయసు మధ్య ఉన్న పిల్లల జనాభా మొత్తం జిల్లా జనాభాలో
10.8శాతం ఉన్నది.

2011 జనగణన ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా
87.29% కాగా 12.71 శాతం మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తు
న్నారు. జిల్లాలో మొత్తం 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, గ్రామ
పంచాయతీలు 526 ఉన్నాయి.

ప్రాజెక్టులు

పోచారం ప్రాజెక్టు : బిక్కనవోలు (బిక్కనూరు) సంస్థానాధీశుడైన
రెండవ కామారెడ్డి పేరిట వెలసిన గ్రామమే కామారెడ్డి. జిల్లాలో
పోచారం మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు. నాగిరెడ్డి పేట మండలం,
పోచారం గ్రామం వద్ద ఆలేర్ ఏరుపై దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు
మెదక్ నుంచి 20 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. 1922లో
రూ.27.11 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు
కాల్వ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభు త్వం రూ.1,430 లక్షలు
మంజూరు చేసింది. ఇక రాజీవ్ పల్లెబాట పథకం కింద పిల్ల కాల్వల
నవీకరణ కోసం రూ.73 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఈ
ప్రాజెక్టు కింద మొత్తం 10,500 ఎకరాల ఆయకట్టు ఉన్నది. మొత్తం
42 గ్రామాల రైతులు దీనివల్ల ప్రయోజనం పొందుతున్నారు. ఈ
ప్రాజెక్టుపై అంతర్ రాష్ట్ర వివాదాలు ఏమీ లేవు.

నిజాంసాగర్ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టును నిజాం 1923-31
మధ్య కాలంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 2.75 లక్షల ఎకరాలకు
నీరందుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో పూడిక పేరుకు పోవడం వల్ల
పూర్తి సామర్థ్యంలో నీటి నిల్వ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో
నిజాంసాగర్ ప్రాజెక్టును మరింత మెరుగు పరచడం ద్వారా పూర్వవైభవం
తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది. కాగా 1970లో
అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నవీనీకరించి, దీని ఎత్తును 426.87
మీటర్ల నుంచి 428.24 మీటర్లకు పెంచింది. తద్వారా ప్రాజెక్టు స్టోరేజీ
సామర్థ్యం 11.8 టీఎంసీ నుంచి 17.8 టీఎంసీకి పెరిగింది.
నిజాంసాగర్ ప్రధాన కాల్వకు అనుసంధానంగా సింగితం
మరియు కళ్యాణి వాగు డైవర్షన్ కాల్వను రూ. 985 లక్షల వ్యయంతో
నిర్మించారు. ఇందుకు నాబార్డ్ ఆర్థిక సహాయం అందించింది. ఈ
ప్రాజెక్టు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామం వద్ద ఉన్నది.
గోదావరి బేసిన్లోని మంజీర దీనికి ప్రధాన వనరు.

నిజామాబాద్ జిల్లాలోని 15 మండలాలకు చెందిన 2.31 లక్షల ఎకరాలకు సాగు
నీరు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి
అంతర్ రాష్ట్ర వివాదాలు ఏమీ లేవు. హైదరాబాద్ నగరానికి 110
కి.మీ దూరంలోని కామారెడ్డిలో జాతీయ రహదారి, రైల్వేలైను
ఉన్నాయి. మెదక్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలకు
కూడలి.

జిల్లా ప్రత్యేకతలు

తెలంగాణలో బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక ప్రాంతమిది. బీటెక్
డెయిరీ టెక్నాలజీ కళాశాల ఇక్కడే ఉంది. కామారెడ్డిలో గిరిజన
సహకార ఉత్పత్తి కేంద్రం అంటే తేనె శుద్ధి కేంద్రం ఉన్నది.

దేవాలయాలు: భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం,
కాలభైరవస్వామి, లక్ష్మీనరసింహ స్వామి, బుగ్గరామ లింగేశ్వర,
బసవేశ్వర ఆలయాలు.. నిజాం సాగర్, పోచారం, కౌలాస్ నాలా
ప్రాజెక్టు, దోమకొండ సంస్థానం కోట, పోచారం ప్రాజెక్టు, పోచారం
అభయారణ్యం పర్యాటక ప్రాంతాలు. గాయత్రి, మాగి చక్కెర
కర్మాగారాలు ప్రధానమైనవి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here