తెలంగాణలోని 33 జిల్లాల్లో ఒకటి. కరీంనగర్‌ను గతంలో ఎలగందల’ అని
వ్యవహరించేవారు. కన్నడ రాజులైన పశ్చిమ చాళుక్యులు దీనిని పాలించారు.
ఇది శాతవాహనుల సామ్రాజ్యంలో కూడా భాగంగా ఉండేది. తర్వాత పాలించిన
నిజాం నవాబులు దీని పేరును కరీంనగర్‌గా మార్చారు. షాహిన్‌షా
కరీంనగర్ హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి పేరుమీదుగా
కరీంనగర్ పేరును ఖరారు చేశారు. 2016, అక్టోబర్ నెలలో చేపట్టిన
జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కరీంనగర్ జిల్లాను విడగొట్టి
జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం
ఏర్పాటు చేసింది.
కరీంనగర్ జిల్లా మొత్తం 2,140.34 చదరపు కిలోమీటర్ల
విస్తీర్ణం కలిగివుంది. ఉత్తరాన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు, దక్షిణాన
వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాలు, తూర్పున రాజన్న-సిరిసిల్లా,
పశ్చిమాన జయశంకర్- భూపాలపల్లి జిల్లాలతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉంది.
2011 జనగణన ప్రకారం ‘ జిల్లా జనాభా 10,05,711.
అక్షరాస్యత 69. 16 శాతం మరియు జనసాంద్రత 470 నమోదైంది.
మొత్తం 33 జిల్లాల్లో అక్షరాస్యత, జనసాంద్రతలో ఐదవ స్థానాన్ని ఆక్ర
మించింది.
జిల్లాలో మొత్తం పట్టణ జనాభా 3,08, 984. ఇది మొత్తం
జనాభాలో 30.74%. జిల్లాలో కరీంనగర్ ఒక్కటే మున్సిపల్
కార్పొరేషన్. హుజురాబాద్, జమ్మికుంటలు నగర పంచాయతీలుగా
ఉన్నాయి. జిల్లాను రెండు రెవెన్యూ డివిజన్లుగా విడగొట్టారు. అవి
వరుసగా కరీంనగర్, హుజూరాబాద్లు. జిల్లాలో మొత్తం 16
మండలాలు ఉన్నాయి.
జిల్లాలో మొత్తం 210 రెవెన్యూ గ్రామాలు, 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
జిల్లా ప్రత్యేకతలు: కరీంనగర్ లో వెండితో వస్తువులు తయారు
చేసే ‘ఫిలిగ్రి కళ’ ప్రపంచ గుర్తింపు పొందింది. కరీంనగర్ పట్టణంలో
‘తీన్ మినార్’ చారిత్రక కట్టడం కలదు. ఈ జిల్లాలో ప్రముఖమైన
దేవాలయాలు ఉన్నాయి. అవి నగునూరు శివాలయం, ఇల్లంతకుంట
రామాలయం, కాట్రపల్లి శివాలయం. హజరత్ సయ్యద్ కరీముల్లా
షాఖాద్రి దర్గా కలదు. ఈ జిల్లాలో చారిత్రక నేపధ్యం ఉన్న జైన క్షేత్రం
గంగాదరలోని బొమ్మలమ్మగుట్ట. కరీంనగర్ వాసులకు ట్యాంక్ బండ్
అనుభూతి కల్గించే లోయర్ మానేర్ డ్యాం పట్టణానికి సమీపంలో
ఉంది.