ఇండస్ట్రీలో ఒక హీరోకు సంబంధించిన సినిమాలు ఓకే రోజున రిలీజ్ అవ్వడం కామన్.. కానీ ఒక డైరెక్టర్ కు సంబంధించిన సినిమాలు ఓకే రోజున రిలీజ్ అవ్వడం వెరీ రేర్ అనే చెప్పాలి. ఇలాంటి ఇన్సిడెంట్ 1990లో జరిగింది.
అర్ధాంగి చిత్రంతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు మోహనగాంధీ. మంచి మనసులు, వారసుడొచ్చాడు, మౌనపోరాటం చిత్రాలతో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.1990లో ఆయన దర్శకత్వంలో విజయశాంతి ప్రధానపాత్రలో కర్తవ్యం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు.. లేడీ సూపర్ స్టార్ అనే పేరు ఈ సినిమాతోనే గుర్తింపు పొందారు విజయశాంతి. ఈ సినిమాకు ఆమె మొదటిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ రోజున మోహన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా రిలీజ్ అయింది. అది ఆడది అనే సినిమా. నటుడు శివకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా శివకృష్ణ, శారద, యుమన కీలక పాత్రలో నటించారు. కర్తవ్యం, ఆడది చిత్రాలు ఓకే రోజున రిలీజ్ అవడంతో కర్తవ్యం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ప్రభంజనంలో ఆడది చిత్రం తుడిచి కొట్టుకుపోయింది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలకి పరుచూరి గోపాలకృష్ణ రచయితగా పనిచేశారు. ఆయన ఆడది సినిమాని ఓ వారం రోజుల తర్వాత రిలీజ్ చేయాలని శివకృష్ణకి సూచించారట. కానీ శివకృష్ణ ఒప్పుకోకపోవడంతో కర్తవ్యం సినిమా రిలీజ్ రోజే ఆడది చిత్రం కూడా రిలిజైంది. ఫలితంగా కర్తవ్యం సినిమా ఎక్కడికో వెళ్ళగా, ఆడది చిత్రం దెబ్బతింది. ఈ విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.