ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు హృదయ సంబంధిత వ్యాధులే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటి వల్ల ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది మృత్యువాత పడుతున్నట్టు తెలిపింది. ఈ రకంగా సంభవిస్తున్న మరణాలలో నాలుగు గుండెపోటుల ద్వారా అయితే, మరో ఐదుగురు స్ట్రోక్ ల కారణంగా చనిపోతున్నట్టు వెల్లడించింది. మూడింట ఒక వంతు తక్కువ వయసున్న లేదా 70ఏళ్ల లోపు వారిలోనే ఈ మరణాలు సంభవిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల ప్రకారం జీవన శైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం, రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గించుకోవాలి
ఊబకాయం ఉన్నవారు లేదా అధిక బరువు ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని CDC పేర్కొంది. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా కీలకం. దాంతో పాటు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అధిక బరువు వల్ల గుండె, రక్తనాళాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి శరీరం బరువు విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాలు తీసుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ప్రతిరోజూ వీలైనంత ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలను డైట్ లో చేర్చుకోవాలి. వీటితో పాటు రోజూవారి ఆహారంలో ఉప్పు, చక్కెర పరిమాణాన్ని తగ్గించుకోవడం మరో ముఖ్య విషయం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
దినచర్యలో క్రమం తప్పకుండా చేయాల్సింది వ్యాయామం ఒకటి. ఇది శరీర బరువును కంట్రోల్ చేయడంలోనే కాకుండా, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ సమస్యలను దూరం చేస్తుంది. పెద్దలు ప్రతి వారం 2 గంటల 30 నిమిషాల పాటు కొంత వ్యాయామంలో పాల్గొనాలని CDC సిఫార్సు చేస్తుంది. ఇందులో సైకిల్ తొక్కడం, నడక వంటివి చేర్చుకోవచ్చని తెలిపింది.
ధూమపానానికి దూరంగా ఉండండి
సిగరెట్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదనంగా, ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతాయి. ధూమపానం చేయని వారు కొత్తగా ప్రారంభించకూడదు. కానీ ముందు నుంచీ అలవాటు ఉన్న వారు మాత్రం దాన్ని తగ్గించుకోవడం లేదా మానేయడం వంటివి చేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
వైద్యున్ని సంప్రదించాలి
గుండె సంబంధింత వ్యాధులతో బాధపడే వారు చేయవల్సిన మరో పని వైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించడం. ఆరోగ్య సమస్యల పరంగా శరీరంలో జరిగే ఏవైనా మార్పులను ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. దీనికి ఖచ్చితమైన సమయ వ్యవధి కూడా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.