అరుంధ‌తికి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట..!

కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అరుంధ‌తి .. మ‌ల్లెమాల ఎంంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై శ్యామ్‌ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2009లో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 16న విడుద‌లైన అరుంధతి సెన్సేష‌న‌ల్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తో అనుష్క ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

నిజానికి ఈ సినిమాలో సినిమాలో అరుంధతి పాత్రకు మొదటగా అనుష్కను అనుకోలేదట మేకర్స్ . మ‌ల‌యాళ కుట్టి మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ను ఈ సినిమా కోసం సంప్రదించార‌ట‌. కానీ ఆమెతో కొందరు – శ్యామ్ సినిమా అంటే సంత్సరాల పాటు నిర్మాణం సాగుతూంటుందని, దాని వల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోతావని చెప్పడంతో సినిమాను తిరస్కరించానని గ‌తంలో ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆ తరువాత అనుష్కను అనుకున్నారట మేకర్స్ .. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ సరసన విక్రమార్కుడు సినిమా చేస్తున్న టైమ్ లో అనుష్కకుఈ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమా అవకాశం ఆమెకు రాగానే రాజమౌళిని సలహా అడిగిదంట అనుష్క.. – శ్యామ్ చాలా గొప్ప ఫిలిమ్ మేకర్ అనీ, ఆయన సినిమాలో నటించడం అదృష్టమని అనుష్కకు సలహా ఇచ్చారట రాజమౌళి. అలాఅనుష్క ఈ సినిమాను అంగీకరించారట.

అరుంధతి సినిమాని 2009 జ‌న‌వ‌రి 16న సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. 14.5 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ భారీ చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సరిగా ముందుకు రాకపోవడం, వచ్చినవారు కూడా నిర్మాత లాభాలు కళ్ళజూసే రేటు చెప్పకపోవడంతో శ్యాంప్రసాద్ రెడ్డి స్వయంగా అన్ని ఏరియాల్లోనూ విడుదల చేసుకున్నారు.. 35 ప్రింట్లతో సినిమాను విడుదల చేయగా, మరుసటి వారానికి 290 ప్రింట్లకు, ఆపై వారం 360 ప్రింట్లకు పెరిగి 2009 సంక్రాంతి హిట్ గా నిలిచింది అరుంధతి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here