మేడారం హెలికాప్టర్​ రైడ్​.. టికెట్​ బుక్​ చేయాలంటే

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హేలీ రైడ్ ను ఏర్పాటు చేస్తున్నది. బెంగుళూరు కు చెందిన తుంబి ఎవియేషన్ సంస్థ ఈనెల 13 నుంచి ఆరు రోజుల పాటు ఈ హెలికాప్టర్​ను అందుబాటులో ఉంచనుంది. . మేడారం జాతరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ ప్రకటన విడుదల చేశారు.

హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి మేడారం వరకు అప్​ అండ్​ డౌన్​ ట్రిప్​కు ఒక్కొక్కరికి రూ. 19,999 ఛార్జ్​ చేస్తారు. మేడారం జాతర ప్రాంగణంలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి రూ. 3700 ఛార్జ్ చేస్తారు. మహా జాతరకు వచ్చే భక్తులు ఈ అరుదైన సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.

హేలీ రైడ్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే 9400399999,9880505905 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని పర్యాటక శాఖ వెల్లడించింది.

పూర్తి వివరాలు ఈ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి. https://helitaxii.com/

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here