వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫిదా. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించాడు. 2017 జూలై 21న రిలీజైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి, ఎన్ఆర్ఐ కుర్రోడిగా వరుణ్ తేజ్ నటనకు ప్రేక్షకులు నిజంగా ఫిదా అయిపోయారు.
అయితే ఈ మూవీని స్టార్ హీరోలతో చేయాలని ముందుగా దిల్ రాజు అనుకున్నారట. అయితేఈ సినిమా స్టోరీని ముగ్గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. దీంతో స్టార్ హీరోల కంటే యంగ్ హీరోనే బెటర్ అనుకుని వరుణ్ తేజ్ ను అప్రోచ్ అయ్యారట శేఖర్ కమ్ముల. ఇంతకీ ఈ సినిమాను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో తెలుసుకుందాం.
ముందుగా డైరక్టర్ శేఖర్ కమ్ముల మహేష్ బాబును అప్రోచ్ అయ్యారట .. అతనికి కథ చాలా బాగా నచ్చినప్పటికీ కొత్త హీరో అయితే బాగుంటుందని సూచించారట. ఆ తరువాత ఈ కథను రిజెక్ట్ చేసిన మరో ఇద్దరు మెగా హీరోలేనంట.
మొదటిగా ఈ కథను దిల్ రాజు అల్లు అర్జున్ కి వినిపించారని, అతను వద్దని చెప్పేసరికి రామ్ చరణ్ వద్దకు వెళ్ళిందంట. అయితే చరణ్ కూడా ఈ కథను రిజెక్ట్ చేశారు. గుడ్ స్టోరీ అయినప్పటికీ, తమ ఇమేజ్ కి మ్యాచ్ కాకపోతుందనే అనుమానంతో బన్నీ, చెర్రీ వదులుకున్నారట.