ఇండస్ట్రీలో వారసత్వం అనేది వెరీ కామన్.. అయితే హీరోలు నుండి ఎక్కువ మంది వారసులు ఇండస్ట్రీకి వస్తుంటారు. హీరోయిన్ల విషయం లోకి వారసత్వం చాలా తక్కువే అని చెప్పాలి. అక్కా చెల్లెల్లుగా ఇండస్ట్రీలో వచ్చిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నగ్మా,జ్యోతిక, రోషిని ఉన్నారు.
స్టార్ హీరోలతో కలిసి నటించి తనకంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది నగ్మా. రాజకీయాల్లోకి కూడా వెళ్ళింది. ఇక జ్యోతిక తమిళ్, తెలుగు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రోషిని చాలా తక్కువ సినిమాల్లో నటించింది. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లతో కలిసి ఓ స్టార్ హీరో నటించాడు. ఆయన ఎవరో తెలుసా? ఇంకెవరో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి.
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించి ఒక అరుదైన రికార్డు అందుకున్నారు చిరంజీవి. నగ్మాతో రిక్షావోడుతో పాటు మరో రెండు సినిమాల్లో నటించారాయన. ఇక వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఠాగూర్ సినిమాలో చిరంజీవి సరసన జ్యోతిక నటించారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జ్యోతిక కనిపిస్తుంది. రోషిని కూడా చిరంజీవితో ఆడిపాడింది. చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ గా నటించారు రోషిని.
అయితే ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లతో చిరంజీవి చేసిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకోవడం విశేషం.