వెయిట్ లిఫ్టింగ్ మహిళలకు తగినది కాదు..ఇది గాయాలను చేస్తుంది. శారీరక శ్రమ ఏదైనా సరే అనారోగ్యానికి, లేదా ఏవైనా గాయాలకు దారి తీస్తుంది. సరైన గైడ్ లైన్స్, ట్రైనింగ్ తో చేస్తే మహిళలకు వెయిట్ లిఫ్టింగ్ తో అంత ఇబ్బందేం ఉండదు. కండరాల నొప్పి, ఎముకలను బలోపేతం చేయడంలోనూ ఇది సహాయపడుతుంది.
వెయిట్ లిఫ్టింగ్ మహిళలను లోగా చేస్తుంది
నిజానికి ఇది నిజం కాదు. వెయిట్ లిఫ్టింగ్ శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి మహిళలు కార్డియాపైనే దృష్టి పెట్టాలి
బరువు తగ్గేందుకు మహిళలు వెయిట్ లిఫ్టింగ్ ను కార్డియో వాస్కులర్ వ్యాయామంతో చేయడం ప్రభావవంతంగా ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ కండర ద్రవ్యరాశిని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. కొవ్వును బర్న్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది.
వెయిట్ లిఫ్టింగ్ మహిళలను వంగకుండా చేస్తుంది
సరైన స్ట్రెచింగ్, మొబిలిటీ వ్యాయామాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది నిజానికి కండరాల అసమతుల్యతను నివారిస్తుంది.
వెయిట్ లిఫ్టింగ్ కేవలం యువ మహిళలే చేయాలి
ఇది తప్పు. అన్నివయసుల మహిళలు వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొనవచ్చు. ఇది ఎముక సాంద్రతను నిర్వహించడం, వయసు సంబంధిత, కండర సంబంధిత నష్టాలను నివారించడం, ఆరోగ్యకరమైన వృద్ధాప్ాన్ని ప్రోత్సహించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
వెయిట్ లిఫ్టింగ్ సంతానోత్పత్తి లేదా గర్భాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది
సురక్షితమైన, గైడ్స్ సహాయంతో చేసే వెయిట్ లిఫ్టింగ్ ఎలాంటి ఆటంకాన్ని కలిగించదు. గర్భధారణ సమయంలోనూ ఎలాంటి ప్రమాదాన్ని కలిగించదు. కానీ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ నిపుణుల సలహా మాత్రం తీసుకోవడం మర్చిపోవద్దు.
మహిళలు భారీ బరువులు ఎత్తలేరు
స్ర్తీలు కూడా అధిక బరువులు ఎత్తే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. దానికి సరైన ట్రైనింగ్ అవసరం.
వెయిట్ లిఫ్టింగ్ టోన్డ్ ఫిజిక్ కావాలనుకునే మహిళలకు కాదు
స్ర్తీలలో కండరాల స్థాయిలను అభివృద్ధి చేయడానికి వెయిట్ లిఫ్టింగ్ అత్యంత ప్రభావవంతమైన పద్దతి. ఇది శరీరాన్ని సరైన ఆకృతిలో చేస్తుంది. లీన్, టోన్డ్ రూపాన్ని సృష్టిస్తుంది.