బాలయ్య, రాఘవేంద్రరావు అట్టర్ ప్లాప్ కాంబో… ఒక్కటి హిట్ లేదు

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఇలా ఎందరో స్టార్ హీరోలకు సూపర్‌హిట్‌లు అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హీరో బాలకృష్ణకు మాత్రం ఒక్క హిట్ కూడా అందించలేకపోయారు .వీరిద్దరి కాంబోలో మొత్తం ఏడు సినిమాలు రూపొందగా ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య చేసిన మొదటి సినిమా ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’.. ఇందులో ఎన్‌టీ రామారావు, నందమూరి బాలకృష్ణ కలసి నటించారు. 1980లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత 1985లో వచ్చిన ‘పట్టాభిషేకం’ కూడా ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది. ఆ తర్వాత ‘అపూర్వ సహోదరులు’, ‘సాహస సామ్రాట్’ ‘దొంగరాముడు’. ఇలా ఐదు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌‌లో సినిమాని చేయడానికి నిర్మాతలు వెనక్కి తగ్గారు.

అయితే ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయిన అశ్వినీదత్ ‘అశ్వమేధం’ పేరిట భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆంధ్రుల సోగ్గాడు శోభన్‌ ‌‌‌బాబు కీలకపాత్రలో నటించారు. ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ వున్నా ఈ సినిమా కూడా ప్లాప్‌‌ని మూటగట్టుకుంది. ఆ తర్వాత దాదాపు 16 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావుతో జత కట్టారు బాలయ్య . అదే ‘పాండురంగడు’. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రం ఆధారంగా ఈ సినిమాని తెరక్కించారు. అయితే ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు రుచించలేదు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here