కాంగ్రెస్​ కు కొత్త ఇన్​ఛార్జీ మాణిక్​.. ఎంపీ పొంగులేటికి పొగ.. ఫిబ్రవరిలో మళ్లీ కార్ల రేస్​.. కోదండరాం కొత్త రూట్​.. భారీగా సింగరేణి సంపాదన.. ఈ రోజు టాప్​ న్యూస్​

మాణిక్కం అవుట్.. మాణిక్ ఇన్..

టీపీసీసీ కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావ్ ఠాక్రే నియామకం అయ్యారు. ఈ మేరకు అదిష్టానం ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాగూర్ ను హైకమాండ్ గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. 1954 లో మహారాష్ట్రలో జన్మించిన మాణిక్‌రావ్ ఠాక్రే 1985 నుంచి 2004 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008 నుంచి 15 వరకు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా వ్యవసాయ గ్రామీణాభివృద్ది, హోం శాఖ , విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 

ప్రగతిభవన్‌లో ఆంధ్ర రాజకీయాలు

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో  సీఎం కేసీఆర్ ను కలిశారు. తనను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షునిగా నియమించినందుకు మరోసారి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పటిష్టం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఏపీ నేత చింతల పార్థసారథి కూడా ఉన్నారు.

పొంగులేటికి పొగబెడుతున్నకేసీఆర్‌

ఖమ్మం మాజీ ఎంపిక్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ఇన్ని రోజుల నుంచి ఉన్న సెక్యూరిటీని తగ్గించింది. త్రీ ప్లస్ త్రీ గా ఉన్న గన్ మెన్ లను టూ ప్లస్ టూకి తగ్గించింది. సెక్యూరిటీగా ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించింది. ఇంటి దగ్గర భద్రతగా ఉండే ఐదుగురు సిబ్బందిని పూర్తిగా వెనక్కి తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఖమ్మంలోని తన ఇంట్లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో సొంత పార్టీపై పొంగులేటి చేసిన కామెంట్లకు రియాక్షన్ గానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.  

ఇప్పటికీ 20 ఏండ్ల‌ కిందటి కష్టాలే: రేవంత్

రాష్ట్ర ప్రజలు 2003లో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారో 2023లోనూ అవే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై చార్జ్ షీట్ విడుదల చేస్తామని తెలిపారు. ధరణి సైట్లో లోపాలను జనాల్లోకి తీసుకెళ్లడం, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల రూల్స్, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా వంటి అంశాలపై బుధవారం హైదరాబాద్లోని బోయినపల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ కేంద్రంలో నిర్వహించిన ఒక్కరోజు పీసీసీ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

కేసీఆర్​ అవినీతిపై కోదండరాం ఆందోళనలు

కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజల బాధలు పట్టడం లేదని, సొంత అస్తిత్వం కోసం తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని ఏనాడు పట్టించుకోలేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఎనిమిదిన్నరేండ్లలో కేసీఆర్ సర్కార్ అడ్డగోలుగా రాష్ట్ర సంపదను దోచుకుందని.. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష ఇంకా నెరవేరలేదని అన్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ అవినీతిని ఎండగట్టేందుకు ఆందోళనలు చేపడుతామని ​అన్నారు. జనవరి 30 న డిల్లీలో సెమినార్, 31న విభజన హామీలపై ఆందోళన, కృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 10న నిరసన దీక్ష, చేస్తాంఈ నెల 20న ధరణి సమస్యలపై సదస్సు నిర్వహిస్తామని అన్నారు.

పల్లె దవాఖాన్లలో 1365 ఉద్యోగాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లె దవాఖాన్లలో 1365 మిడ్‌ లెవల్ హెల్త్ కేర్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్‌ బేసిస్‌పై ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు(బీఏఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), నర్సులు ఈ పోస్టులకు అర్హులు కాగా,  గురువారం నుంచి ఈ నెల ఏడో తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

బుక్‌మై షోలో రేసింగ్ లీగ్ టికెట్లు

 ఫిబ్రవరి 11వ తేదీన నెక్లెస్ రోడ్‌లో ఫార్ములా ఈ రేస్ జరగనుంది. ఇందుకు సంబంధించి బుధవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌లో టికెట్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. టికెట్‌లను బుక్ మై షోలో లాంచ్ చేశారు.

కలెక్టరేట్ ఆస్తులు జప్తు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేసిన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని అడిషనల్  జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టునిర్మాణంలో బాల్కొండకు చెందిన పలువురు రైతులు తమ సాగు భూములు కోల్పోయారు. దాదాపు రూ.11 లక్షలు తమకు చెల్లించకపోవడంతో నిర్వాసితులందరూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కలెక్టరేట్లోని ఆస్తుల జప్తుకు జడ్జి ఆదేశాలిచ్చారు.  

కడుపులో టవల్ మరిచిపోయిన డాక్టర్

పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు డెలివరీ చేసిన ప్రైవేట్ డాక్టర్.. కడుపులో టవల్ మరిచిపోయి కుట్లేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లా బన్స్ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. డెలివరీ తర్వాత కూడా ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో వేరే హాస్పిటల్కెళ్లి పరీక్షించుకోగా లోపల టవల్ ఉన్నట్టు గుర్తించారు.   మళ్లీ ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) రాజీవ్ సింఘాల్కు బాధితులు కంప్లైంట్ చేశారు.

దవాఖానలో అడ్మిటైన సోనియా

కాంగ్రెస్‌ మాజీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. రొటీన్‌ చెకప్‌లో భాగంగానే ఆమె బుధవారం ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నుంచి శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా.. తన కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు.

రాహుల్‌ రామ్‌మందిర్ మద్దతు!

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రామమందిర్‌ ట్రస్ట్‌ మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్ తెలిపారు.  ఉత్తరప్రదేశ్‌లో మార్పులకు సంకేతమా! అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. 

సింగరేణి సంపాదన 23,225 కోట్లు

ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి గత థర్డ్‌ క్వార్టర్‌ ముగిసే నాటికి రూ.23,225 కోట్ల ట‌ర్నోవ‌ర్ ను సాధించి ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. లాస్ట్‌ ఇయర్‌ ఇదే టైమ్‌కు  సింగ‌రేణి రూ.18956కోట్ల  ట‌ర్నోవ‌ర్ సాధించగా ఈయేడు  దాని కంటే 23 శాతం అధిక‌ వృద్ధిని నమోదు చేసింది.  లాస్ట్‌ ఫైనాన్షియల్ ఇయర్‌ 2021–22లో సింగ‌రేణి వార్షిక ట‌ర్నోవ‌ర్ రూ.26619కోట్లు కాగా ఈయేడు  మార్చి మాసాంతానికి రూ.34 వేల కోట్ల కు చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి. 

ఫ్లైట్‌లో కోప్యాసింజర్‌పై దారుణం

న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్యాసింజర్ పిచ్చిగా ప్రవర్తించాడు. తాగిన మత్తులో మహిళా ప్యాసింజర్ పై మూత్రం పోశాడు. అయినా ఫ్లైట్ సిబ్బంది అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతేడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా తాజాగా స్పందించింది. వృద్ధురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్యాసింజర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అతను తమ విమానాల్లో నెల పాటు ప్రయాణించకుండా నిషేధం విధించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

50 రోజుల‌ గంగా విలాస్

ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ ఓడ ‘గంగా విలాస్’ను  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న ప్రారంభించనున్నారు. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. గంగా విలాస్’ నౌక యూపీలోని వారణసిలో బయలుదేరి బంగ్లాదేశ్ గుండా అసోంలోని దిబ్రుగర్ చేరుకుంటుందని తెలిపారు. మొత్తం 50 రోజుల్లో భారత్‌, బంగ్లాదేశ్‌లోని 27 నది వ్యవస్థల్లో 3200 కిలోమీటర్ల మేర ప్రయాణించనుందని వివరించారు. 80 మంది ప్రయాణికుల సామర్థ్యమున్న లగ్జరీ రివర్ క్రూయిజ్ నౌక ఇది. ఇందులో 18 సూట్స్‌తోపాటు ఇతర అనుబంధ వసతులు ఉన్నాయి.

పెరగనున్న గ్రీన్ హైడ్రోజన్‌ ఉత్పత్తి

దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు గాను నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే 2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం, దీనికి అదనంగా ఏటా 124 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని కూడా పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ కు మొదటి దశలో రూ. 19,744 కోట్లను కేంద్రం కేటాయించింది. 

అమెరికా సర్కార్‌లో ఇండియన్లు

అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ అర డజను మంది ఇండియన్‌ అమెరికన్లను తన అడ్మినిస్ట్రేషన్‌లో కీలక స్థానాల్లో తిరిగి నామినేట్‌ చేశారు. మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసోర్సెస్‌ డిప్యూటీ సెక్రటరీగా రిచర్డ్‌ వర్మ(54), వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ అమెరికా ప్రతినిధి డాక్టర్‌‌ వివేక్‌ హల్లెగెరె మూర్తి(45) పేర్లను సెనెట్‌కు బైడెన్ పంపారు. అంజలి చతుర్వేదిని వెటరన్స్‌ అఫైర్స్‌ జనరల్‌ కౌన్సెల్‌గా, రవి చౌదరిని ఏయిర్‌‌ ఫోర్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా, గీతా రావు గుప్తాను గ్లోబల్‌ ఉమెన్స్‌ ఇష్యూస్‌ అంబాసిడర్‌‌గా, రాధా అయ్యంగార్‌‌ను డిఫెన్స్‌ డిప్యూటీ అండర్‌‌ సెక్రటరీగా జో బైడెన్‌ రీ నామినేట్‌ చేశారు. ఇప్పటికే ఇండియన్ అమెరికన్‌ అయిన కమలా హ్యారీస్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc