ఎంత పెద్ద హిట్ మూవీ అయిన సరే మహా అయితే ఓ నాలుగైదు భాషల్లోకి రీమేక్ అవుతుంది కావచ్చు కానీ.. ఓ చిత్రం మాత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. అదే నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
2005 జనవరి 14న విడుదలై ఈ చిత్రం ఘన విజయం అందుకుంది. ధనిక అబ్బాయి, పేద అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ ప్రతి ఒక్కరిని హత్తుకుంది. ఈ చిత్రం 79 కేంద్రాలలో 50 రోజులు,35 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. దీంతో ఈ చిత్రాన్ని 7 భారతీయ భాషల్లోకి, 2 విదేశీ భాషల్లోకి రీమేక్ చేశారు.
- ఉనక్కం ఎనక్కం (తమిళం)
- నీనెల్లో నానల్లే (కన్నడ)
- ఐ లవ్ యు (బెంగాలీ)
- నింగోల్ తజబ(మణిపురి)
- సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా)
- తేరా మేరా కీ రిష్తా (పంజాబీ)
- రామయ్య వస్తావయ్యా (హిందీ)
- 8.నిస్సా అమర్ తుమీ (బంగ్లాదేశ్ బెంగాలీ)
- 9.ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా (నేపాలీ)