Homelatestరాచకొండ.. రాజఠీవి గుట్టలు

రాచకొండ.. రాజఠీవి గుట్టలు

సుమారు 700 ఏళ్లనాటి చారిత్రక అద్భుత ఆనవాళ్లు అవి. నాడు తెలంగాణ కీర్తిని తమ పాలనలో ద శదిశలా వ్యాప్తింపజేసిన రాజులు వాళ్లు. శుత్రుదుర్భేధ్యంగా కోటను నిర్మించడంతో పాటు వారి రాజ్యం అంతా 150 దేవాలయాను నిర్మించారు. ప్రకతి వైఫరిత్యాలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి నా.. ఇప్పటికీ ఆ‘రాజ’దర్పం పర్యాటకులకు ఔరా అనిపిస్తుంది. శివాలయాలు, కోట ముఖద్వారాలు, కొండ సరికల్లో బైరవుని వాస్తవ రూపాలతో ఉన్న విగ్రహాలు, నాట్య, ప్రార్థన మందిరాలు.. శిథిలమ వుతున్న ‘రాచ’ఠివికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణకు ఇంతటి కీర్తి తెచ్చింది నాటి పద్మనాయక వంశ (వెలమ)రాజులు. హైదరాబాద్‌కు అతి సమీపాన ఉన్న ఈ ప్రాంతంను ప్రభుత్వం అభివద్ధి చేస్తే ప్రపచంలో ఒక చారిత్రక ప్రదేశంగా ఎప్పటికీ మిగలనుంది. ఆలనాడు తెలంగాణకు రా జధానిగా భాసిల్లిన రాచకొండ రాజ్యంలోని కోటలు, ఆలయాలు, ఇంకా ఆక్కడ ఉన్న రాచపాలనకు సంబంధించిన వాటిపై ప్రత్యేక కథనం…

కాకతీయ రాజ్య పతనానంతరం పద్మనాయకులు రాచకొండ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యం స్థాపించా రు. రాచకొండ గ్రామానికి అరకిలోమీటరు సమీపంలో రాచకొండ కోటను నిర్మించారు. క్రీ.శ 1325 నుంచి 1475 వరకు పద్మనాయక వంశీయుల పాలన సాగింది. రాచకొండ, దేవరకొండ దుర్గాలను వీరే నిర్మించారు. రచకొండ దుర్గాన్ని అనపోతనేడు అనే రాజు నిర్మాణం చేయించారు. పద్మనాయక వంశీయుల్లో ఎర్ర దాచనాయుడితో ప్రారంభమైన వీరి పాలన చివరి రాజు సర్వజ్ఞరావు సింగభూ పాలుడితో ముగిసింది. ఆతర్వాత ఈ వంశీయులు విజయనగర రాజ్యంలో సామంతులుగా ఉండ డం, అనంతరం బహుమనీల రాజ్య విస్తరణతో వీరి ఏలుబడిలోకి వెళ్లింది.

35 వేల ఎకరాల అటవీ విస్తీర్ణం..

రాచకొండ అడవి సుమారు 35 వేల ఎకరాలు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్న సంస్థాన్‌నారా యణపురం మండలం పరిధిలో 14,760 ఎకరాలు. మిగతా చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లాలోని మం చాల మండలంలో ఉంది. అటవీ విస్తీర్ణం పెద్దగా ఉండడంతో ఇక్కడ 4 వేలకు పైగా నెమళ్లు ఉన్నా యి. అలాగే నక్షత్ర తాబేళ్లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. కొండలను ఆనుకొని ఉన్న కోనలు, సెలయేళ్లలో వేసవిలో కూడా నీళ్లు ఉండడంతో ఈ తాబేళ్లకు ఈ ప్రాంతం ఆవాసం. విలువైన కలపను గుట్టుచ ప్పుడు కాకుండా నరికి హైదరాబాద్, ఇబ్రహింపట్నంకు తరలిస్తున్నారు. ఒకప్పుడు కీకారణ్యంలా ఉన్న ఈ ప్రాంతం చెట్ల నరికివేతతో మైదానంగా మారుతోంది

రాచకొండ రాజులు కళాపోషకులు..

రాజ్యంలో రాచకొండ రాజులు కళలకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. రాజకోటతో పాటు కొండ కింద కళామందిరాలు నిర్మించారు. కళా మందిరాల్లో కళల నత్య భంగిమలను గోడలపై వేయించారు. రాతి గోడలపై ఇప్పటి లప్పం మందిరిగా ఉండే తెల్లటిబంక గమ్మును ఈ గోడలపై పూయించి.. వాటిపై కళారూపాలను చిత్రీకరింపజేశారు.వందల ఏళ్లయినా, కాల క్రమేణ శిథిలావస్థకు చేరుకున్న ఈ కళా మందిరాల్లోని లోపలి గోడలపై ఇప్పటికీ కళారూపాలు కనిపిస్తుండడం అద్భుతమే. పర్యావరణం కలుషితం కావడంతోనే ఇవి శిథిలం అవుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. నాడు రాచకొండ రాజ్యం అంతా చింత, వేప చెట్లతో పచ్చగా ఉండేదని, పర్యావరణ ప్రమాదం అప్పట్లో లేకపోవడం వల్లే.. గోడలకు పూసిన ఈ తెల్లటి గమ్ముపై చిత్రాలు ఏళ్ల వరకు ఉన్నాయి. ఈ రాజులు కళామందిరాలను కూడా అద్భుతంగా నిర్మించడంతో వీటికింద విలువైనవి ఉంటాయని గుప్తనిధుల కోసం తొవ్వారు. కళలతో పాటు కవులు, శాస్త్ర విజ్ఞాన రంగాలకు ఈ ప్రాంతం స్వర్ణయుగంగా ఉండేంది. చివరి రాజు సింగభూపాలుడు గిర్వాణీ భాషలో ‘రసవర్ణ సుధాకరం’ అనే లక్షణ గ్రంథం, ‘రత్నపాంచాలిక’ నాటిక, సంగీత రత్నంకు సుధాకరమనెడి వ్యాఖ్యానుగ్రంథం రాశాడు. వీరి ఆస్థానంలోనే తెలుగులోని కావ్యత్రయంలోని ముఖ్యమైన రెండు కావ్యాలు రామాయణం, మహాభారతం ఇక్కడి నుంచే వెలుబడ్డాయి. సర్వసింగ భూపాలుని ఆస్థానంలో సహాజ పాండిత్య పోతన ..‘భోగినీదండకం’ రచించాడు.

శైవం.. వైష్ణం ఆరాధం..

రాచకొండలో మొత్తం 150 ఆలయాలున్నాయి. ఇందులో చిన్నవి, పెద్దవి అన్నీ ఎక్కువగా 100కు పైగా శివాలయాలు ఉన్నాయి. ఆతర్వాత రామాలయాలు, కళాబైరవుని ఆలయాలు, కొండ చుట్టూ నలువైపు ఉన్నదారుల్లో దారివెంట ఒక్కో వినాయక ప్రతిమలు చెక్కించారు. తూర్పున ఉదయించే సూర్యకిరణాలు గర్భ గుడిలో శివలింగంపై పడేలా శివాలయాలు కట్టించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే జాతీయ రహదారిలో చౌటుప్పల్‌ సమీపంలో.. రహదారి వెంటే ఉన్న కొయ్యలగూడెం నుంచి రాచకొండకు వెళ్లే దారిలో కొండకింద ప్రధాన శివాలయం ఉంది. ఈ దేవాలయమే రాచకొండ ప్రాంతంలో అతిపెద్ద శివాలయం. తొలిపొద్దు కిరణాలు నేరుగా ఈ శివాలయంలో పడతాయి. రాజు కోటకు అభిముఖంగా కింద ఉన్న ఈ శివాలయానికి రాజులు వచ్చి పూజలు చేసేవారు. ఇక్కడే అహ ల్య నది (అప్పట్లో ఇది నది.. ఇప్పుడు వాగు) పక్కనే ఉండడంతో వసంతోత్సవాలు నిర్వహించేవారు. పద్మనాయక రాజులు శైవంతో పాటు వైష్ణవ ఆరాధం చేశారు. కోటకు వెళ్లే ప్రధాన ముఖద్వారం సమీ పంలో రాముడిని ప్రతిష్టించారు. లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయంతో పాటు కోన సొరికల్లో కాలభైర వుని ప్రతిరూపాలను పెద్దపెద్ద బండరాళ్లపై చెక్కించారు.

7 ముఖ ద్వారాలు.. బండరాళ్లపై లోతైన మంచినీటి బావులు..

రాచకొండలోని రాజు ప్రధానకోటకు కింద నుంచి పైకి 7 ముఖ ద్వారాలు ఉన్నాయి. రాచకొండ గ్రా మానికి సమీపం నుంచి మొదటి ముఖద్వారం ఉంటుంది. ఆతర్వాత అన్ని ద్వారాలు శత్రుదుర్భేధ్యే యంగా నిర్మించారు. రాజుకోట అంతా నామరూపాలు లేకుండా పోయింది. గుప్త నిధుల కోసం తొ వ్వకాలు జరిపి నాశనం చేశారు. కొండపైన కేవలం రాజు ప్రత్యేక ప్రార్థన మందిరం మాత్రమే రాజ దర్పానికి ఆనవాళుగా ఉంది. అలాగే బండరాళ్లతో రాజు కోసం ప్రత్యేకంగా నిర్మించిన మరుగుదొడ్డి ఇప్పటికీ అలాగే ఉంది. కొండపైన 2 ఈత కొలనులు పెద్దపెద్దబండలను తొలిచి నిర్మించారు. లోతైన మంచినీటి బావులు ఉన్నాయి. రాజుకోటకు నలుములల్లో ఓవైపు లోతైన లోయ, రెండు వైపులా ఎక్క డానికి వీలులేని ఎత్తయిన కొండ ఉంటే.. మరోవైపు మైదాన ప్రాంతం నుంచి పైకి ఎక్కే ప్రాంతం ఉం ది. ఉత్తర దిక్కున ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఒకే బండరాయిని తొలిచి లోతైన బావి తొవ్వించారు. శ త్రుసేనలు రాత్రి సమయంలో వస్తే కాలుజారి ఇందులో పడితే పాతాళానికి పోయినట్లేనని ఇక్కడి గిరి జనుల చెబుతునారు. వాస్తవంగా చాలా లోతైన బావిగా ఉంది. దీన్ని సంకెళ్ల బావిగా పిలుస్తారు. రా జ్యంలో పట్టుబడిన దొంగలను కొంతమందిని కొండపైన బంధించే వారు. ఈబావి నుంచి సంకేళ్లు వేసిన దొంగలతో నీళ్లు తోడించారనది కూడా ప్రాచుర్యంలో ఉంది. అందుకే సంకేళ్ల బావిగా పేరు పడి ంది. రాజుకోటపై ఉండి ఎటు చూసినా కనుచూపు మేర రాచకొండ రాజ్యం కనిపించేలా.. కోటను ని ర్మించిడం మరో విశేషం.

చెరువు.. శాసనం..

రాచకొండ రాజ్యంలో చెరువులు, కుంటలు 300 వరకు ఉన్నాయి. పెద్ద చెరువుల వద్ద ప్రత్యేకంగా నాడు రాజులు శాసనాలు వేయించారు. ఈ శాసనాలపై అన్నిమతాల్లోని రైతులకు ప్రాధాన్యతని చ్చేలా, వ్యవసాయ వివరాలను చెక్కించారు. అన్నపోత, నాగసంద్రం, దేవ, రాయ చెరువులు ప్రధానమైనవి. గొలసుకట్టుతో ఉన్న ఈ చెరువులు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. ఈ కొండ, శాసనాలు, సెలయేళ్లు, దేవాలయాలను చూడడానికి రాజధాని, పరిసర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు.

ఎన్నో ప్రయోగాలు.. నిరసనలు

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండలు డెన్‌గా నక్సలైట్లు (మావోయిస్టులు) తమ కార్యకలాపాలు నిర్వహించారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇక్కడ ఉలికి పడేంతా ప్రాబల్యం ఉండేది. ఆతర్వాత ఫీల్డ్‌ఫైరింగ్‌ రేంజ్, మిస్త్సెల్‌ ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్ని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించినా ఇక్కడ నివసిస్తున్న గిరిజనుల ఆందోళనలతో వెనక్కు వెళ్లాయి. కషి విజ్ఞాన కేంద్రం, ఐటీ పార్కు వంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కానీ ప్రజల ఆమోదం లభించే వాటినే ఇక్కడ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించి..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2014 డిసెంబర్‌ 15న రాచకొండ గుట్టలపై నిర్వహించిన ఏరియల్‌ సర్వేలో పా ల్గొన్నారు. దీన్ని ఫిలిం సిటీగా అభివద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఇది తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమ కు రానున్న రోజుల్లో పెద్దదవుతుందన్నారు. 2 వేల ఎకరాల్లో ఫిలిం సిటీ, విద్యా సంస్థలు, క్రీడా ప్రాం గణాలు కోటకు సమీపంలో ఏర్పాటు చేయిస్తామన్నారు. సీఎం పరిశీలించి మూడేళ్లు అవుతున్నా ఈ ప్రాంతంలో అలనాటి రాచరిక ఆనవాళ్లను కాపాడేందుకు, అభివద్ధికి బీజం పడలేదు. ఈ కోటను ఫి ల్మిం సిటీగా అభివద్ధి చేస్తే.. పర్యాటక ప్రాంతంగా విరాజిల్లనుంది. హైదరాబాద్‌ నుంచి 60 కిలోమీ టర్ల ఉన్న రాచకొండ .. సంస్థాన్‌నారాయణపురం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాతీయ రహదారికి సమీపాన ఉండడంతో ప్రభుత్వం దీనిపై దష్టి పెడితే అంతరించిపోతున్న ‘రాచ’కీర్తికి పూ ర్వవైభవం కల్పించినట్లు అవుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc