మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో రకుల్ ను ఎందుకు తీసేశారు?

ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, దశరథ్ దర్శకత్వం వహించారు. కుటుంబ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం 21 ఏప్రిల్ 2011 లో విడుదలై సూపర్ హిట్ అయింది. 2011 ఉత్తమ కుటుంబ కథాచిత్రంగా బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా నిలిచింది.

అయితే ఈ సినిమాకు హీరోయిన్ గా ముందుగా కాజల్ ను అనుకోలేదట మేకర్స్. ముందుగా ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌ గా తీసుకున్నారట. ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట . అయితే ఆ ర‌షెష్ చూసిన నిర్మాత దిల్ రాజుకు శాటిస్పాక్షన్‌గా అనిపించ‌లేదట. ఎందుకంటే మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమా అంతా హీరోయిన్ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుంది. ర‌కుల్ చాలా స‌న్నగా ఉంది. ఎందుకైనా మంచిద‌ని చెప్పి షూటింగ్ ఆపేశామని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తరువాత హీరోయిన్ గా కాజల్ ను ఫైనల్ చేశారు.

ఇక కేరటం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రకుల్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో చిత్రాలు రకుల్ కు హీరోయిన్ గా మంచి క్రేజ్ ను తీసుకువచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్. అయితే మళ్లీ దిల్ రాజు బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. భవిష్యత్తులో సినిమా ఉంటుందో లేదో చూడాలి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here