ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్స్ అంటే గుర్తొచ్చే మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులో ఆర్పీ పట్నాయక్ కూడా ఉంటాడు. తేజ చిత్రం మూవీతో మొదలైన ఆర్పీ సినీ ప్రయాణం.. ఆ తర్వాత నువ్వు నేను, జయం, మనసంతా నువ్వే, నీ స్నేహం, సంతోషం, నువ్వు లేక నేను లేను లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్లు ఆయన ఖాతాల్లో ఉన్నాయి. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా.. సింగర్‌గా కూడా శ్రోతలను, డైరక్టర్ గా ప్రేక్షకులను మెప్పించారు ఆర్పీ.. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో సడన్‌గా సినిమాలకు మ్యూజిక్ చేయడం ఆపేశాడు ఆర్పీ.. ఎస్పీ బాలు లాంటి వాళ్ళు మళ్ళీ మ్యూజిక్ చెయ్ అని అన్న కూడా మళ్ళీ మ్యూజిక్ చేయలేదు ఆర్పీ.
అయితే స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా, తేజ దర్శత్వంలో తెరకెక్కిన నిజం చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించాడు. తేజ డైరెక్టర్ గా స్టార్ హోదాలో ఉండడం, ఒక్కడు తరవాత మహేష్ బాబు సినిమా కావడంతో నిజం మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ సినిమాకు సింగిల్ కార్డులో కులశేఖర లిరిక్స్ రాశారు. ఇందులో 10 పాటలు ఉంటే 7 పాటలు కూడా అర్పీనే పాడారు. అయితే ఇదే తాను చేసిన తప్పు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆర్పీ..అప్పటికి ఉన్న పరిస్థితుల్లో తప్పలేదని వెల్లడించారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి తన వాయిస్ సరిపోలేదని ఆర్పీ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తానూ రీగ్రేట్ గా ఫీల్ అవుతున్నానని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత సినిమాల్లో పాటలు పాడడం ఆపేయాలని చాలా మంది చెప్పారని ఆర్పీ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమాలో నటనకు గాను మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా, మహేష్ తల్లిగా నటించిన తాళ్ళూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన పోలీసు అధికారి పాత్రకు మొదటగా మురళీ మోహన్ అనుకుని సుమారు 70 శాతం చిత్రీకరణ జరిపారు. కానీ రషెన్ చూసిన తర్వాత ఆయన ఆ పాత్రకు సరిపోరని భావించి మళ్ళీ ప్రకాష్ రాజ్ తో తీశారు. అప్పట్లో ఇది పెద్ద వివాదం అయింది. అయితే మురళీ మోహన్ కు పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.