షాద్నగర్ నియోజకవర్గం:
మండలాలు: ఫరూక్నగర్, నందిగామ, కేశంపేట, కొత్తురు, కొందుర్గు, చౌదరిగూడ
ఎమ్మెల్యే: అంజయ్య యాదవ్ (టీఆర్ఎస్)
కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈనియోజకవర్గ నుంచి టీఆర్ఎస్ నుంచి వరుసగా రెండు సార్లు గెలుపోందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటి చేసిన అంజయ్యయాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డిపై 25వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో తెలంగాణ అవిర్బావం తర్వాత టీఆర్ఎస్ హవా నడుస్తుంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక షాద్‌నగర్‌పై ఆపార్టీ దృష్టి పెట్టింది. స్థానిక నేతలను కాకుండా ఇతర ప్రాంతాల నేతలకు పోటికి దింపే అలోచనలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆపార్టీ రాష్ట్ర నేత శ్రీవర్దన్‌రెడ్డి పోటి చేసే అవకాశం ఉంది.
ఈ నియోజకవర్గంలో బీసీలు, లంబాడాల ఆధిపత్యం ఎక్కువ , రెండవ స్థానంలో ఎస్సీలు ఉన్నారు. సిటికి దగ్గర కావడంతో పోలిటికల్ డామినేట్ ఎక్కువ.
నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు:
నియెజకవర్గానికి సాగునీరు అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు అందించలేకపోయారు. రియల్ఎస్టెట్, పారిశ్రామిక వాడలో ఫేమస్ అయిన షాద్‌నగర్‌కు జాతీయ రహదారి కనెక్టివిటి కూడ ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వార కొందుర్గు మండలంలోని లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ ద్వార సాగునీరు అందిస్తామని చెప్పి అందించలేకపోయారు.
పారిశ్రామిక వాడ కావడంతో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.పంటలు నాశనం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల కూలీల వల్ల కూడ ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం నుంచి కాపాడాలని ఆందోళనలు చేస్తున్నారు.
హైద్రాబాద్‌కు దగ్గర ఉండటం రియల్ఎస్టెట్ వ్యాపారాలకు, బడాబడా వ్యక్తుల ఫామ్‌హౌజ్‌ల కోసం రైతులు తమ భూములను బలవంతంగా అమ్ముకుని ఆ ఫామ్హౌస్లలోనే కూలీలుగా మారుతున్నారు.
Shadnagar Election Results 2018
Shadnagar 2018 Assembly Elections
Candidate Name | Party | Votes |
ANJAIAH YELGANAMONI | Telangana Rashtra Samithi | 72315 |
CHOWLAPALLY PRATAP REDDY | Indian National Congress | 51890 |
K. SHANKAR | Bahujan Samaj Party | 27814 |
NELLI SREEVARDHAN REDDY | Bharatiya Janata Party | 5162 |
ANDHARI ANJAIAH | Independent | 3199 |
AMMY SANTHOSH KUMAR | Independent | 2301 |
KETHURU RAGHAVENDER | Independent | 726 |
ANTHAPOORAM MAHENDAR | Independent | 312 |
ANDRA ANUSHA REDDY | Aam Aadmi Party | 297 |
THUMMA VIJAYA ANAND REDDY | All India Forward Bloc | 231 |
NAGARAJU MANNARAM | Bahujana Left Party | 218 |
SANGAMESHWAR DHANAKKA | All India Samata Party | 153 |
None of the Above | None of the Above | 1909 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | ANJAIAH YELGANAMONI | TRS | 72315 | CHOWLAPALLY PRATAP REDDY | INC | 51890 |
2014 | Anjaiah Yelganamoni | TRS | 70315 | Chowlapally Prathap Reddy | INC | 52987 |
2009 | Chowlapally Pratap Reddy | INC | 62222 | Anjaiah Yelganamoni | TRS | 52384 |
2004 | Dr.P.Shankar Rao | INC | 65360 | Bakkani Narasimulu | TDP | 54728 |