ఒకే ఒక్కడు సినిమాను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు

డైరెక్టర్ శంకర్ సినిమాల్లో నటించాలని ఏ హీరోకు ఉండదు చెప్పండి. కానీ ఓ ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం శంకర్ వెళ్లి కథ చెబితే నో చెప్పారట. ఇంతకీ అది ఏం సినిమానో తెలుసా ఒకే ఒక్కడు. అర్జున్, మనీషా కొయిరాలా, రఘువరన్ కీలక పాత్రలో ఈ మూవీ తెరకెక్కింది.

ఒక్క రోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి భారీ విజయం అందుకున్న ఈ సినిమా హిందీలోనూ రీమేక్ అయ్యింది. తమిళంలో ముదల్ వన్ అనే పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ఒకే ఒక్కడు పేరుతో రిలీజ్ అయింది.

అయితే ముందుగా ఈ కథను హీరో రజినీకాంత్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నరట శంకర్. అయితే రజినీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కథ ఉండడంతో రజినీ అప్పట్లో ఈ సినిమాను చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ తరవాత హీరో విజయ్ తండ్రికి ఈ కథను వినిపిస్తే విజయ్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదట.

ఇక టాలీవుడ్ లో అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న రాజశేఖర్ తో ఈ సినిమాను చేయాలని శంకర్ భావించారట. దీంతో ఆయన్ను కలిసి కథను వినిపిస్తే ఆయనకు బాగా నచ్చిందట. కానీ మిగతా సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాను చేయలేదట రాజశేఖర్. ఈ సినిమాను మిస్ అయినందుకు ఇప్పటికీ బాధపడతారట రాజశేఖర్. ఈ విషయాన్ని పలుమార్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజశేఖర్.

దీంతో తన మొదటి సినిమాకు అవకాశం ఇచ్చిన అర్జున్ తో ఈ సినిమాను తీశారు శంకర్. డిఫిరెంట్ కథతో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here