తెలంగాణలోనూ జనసేన పోటీ.. కేసీఆర్​ ఆస్తులపై సంజయ్​ ఫైర్​.. రేపటి నుంచి ఘోరమైన చలి.. గ్రూప్​ 3 అప్లికేషన్లు మొదలు

తెలంగాణలో 7 ఎంపీ సీట్లు పోటీ చేస్తాం: పవన్​ కళ్యాణ్​

వచ్చే ఎన్నికల్లో జనసేన తెలంగాణలో ఏడు నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మంగళవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. తన ‘వారాహి’ ప్రచార రథానికి వాహనపూజ చేయించారు. తెలంగాణలో తన పాత్ర పరిమితమేనని.. అసెంబ్లీలో తమకు పది మంది ఎమ్మెల్యేలు ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. బీజేపీ తనకు దోస్తేనని.. ఇప్పుడు ఆ పార్టీతోనే ఉన్నామని, ఉంటామని పవన్​ స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో ఎన్నికలకు వారం రోజుల ముందు క్లారిటీ ఇస్తామన్నారు. జనసేనతో పొత్తుకు ఎవరైనా ముందుకు వస్తే సంతోషమన్నారు.

కేసీఆర్​ ఆస్తులు వెల్లడించాలి: బండి సంజయ్​

సీఎం కేసీఆర్​ తన ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. మహబూబ్​నగర్​లో మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా సంజయ్​ కేసీఆర్​పై మండిపడ్డారు. కేసీఆర్‌‌‌‌కు చిత్తశుద్ధి ఉంటే 2014కు ముందు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తులెన్ని? రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే వైట్ పేపర్ విడుదల చేయాలని అన్నారు. 2014లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది.. ఇప్పుడున్న అప్పులు, వాటిని ఎలా ఖర్చు పెట్టారనే అంశాలపైనా మరో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా వరల్డ్ నెంబర్​ వన్​

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ టీమ్గా నిలిచింది. 2023లో విజయ యాత్ర కొనసాగిస్తున్న టీమిండియా…న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డేలోనూ ఘన విజయం సాధించింది. 90 పరుగుల తేడాతో గెలవడంతో వన్డేల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను 3-0తో సొంతం చేసుకున్న రోహిత్ సేన…న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను కూడా 3-0తో క్లీన్​ స్వీప్​ చేసింది. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా…ఆస్ట్రేలియా 112 రేటింగ్​తో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ చేతిలో క్వీన్ స్వీప్ కావడంతో న్యూజిలాండ్ రెండు రేటింగ్ పాయింట్లు కోల్పోయి 111 స్కోరుతో 4వ స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో పాకిస్థాన్ 106 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

17న సెక్రెటేరియట్​ ప్రారంభం.. బీఆర్​ఎస్​ సభ

కేసీఆర్​ పుట్టినరోజు ఫిబ్రవరి 17న బీఆర్​ఎస్​ మరో భారీ సభ నిర్వహించనుంది. అదే రోజు ఉదయం 11.30 గంటల నుంచి 12.30గంటల మధ్య కొత్త సెక్రటేరియట్​ ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే రోజున సాయంత్రం సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతకు ముందే మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

గ్రూప్​ 3 అప్లికేషన్లు మొదలయ్యాయి

గ్రూప్ 3 అప్లికేషన్ల ప్రక్రియను టీఎస్​పీఎస్​సీ మొదలు పెట్టింది. వివిధ విభాగాల్లో 1,363 గ్రూప్​ 3 పోస్టులకు ఇటీవలే నోటిఫికేషన్​ జారీ చేసింది. మంగ ళవారం రాత్రి 9 గంటల నుంచి అప్లి కేషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది. వచ్చే నెల 23 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. 105 కేటగిరీలుగా (పోస్ట్ కోడ్స్) ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్​ ఆడిటర్, జూనియర్ ఆడిటర్, సీనియర్ అకౌం టెంట్, జూనియర్ అకౌంటెంట్, అకౌం టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో జూనియర్ అసిస్టెం ట్ పోస్టులే 655 ఉన్నాయి. జులై లేదా ఆగస్టులో ఈ ఎగ్జామ్​ నిర్వహిస్తామని టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​లో పరీక్ష ఉంటుందని ప్రకటించింది.

రేపటి నుంచి ఘోరంగా చలి.. హెచ్చరిక

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈనెల 26 (రేపటి) నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. సుమారు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గురువారం నుంచి విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. బుధవారం15 డిగ్రీలు, గురువారం 12 డిగ్రీలు, శుక్రవారం 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc