రూ.2.90 లక్షల కోట్లతో ఎలక్షన్​ ఎక్స్​ప్రెస్​​.. ఫామ్​ హౌజ్​ కేసు సీబీఐకి.. టర్కీ సిరియాలో భూకంపం 2600 మంది మృతి.. ఈ రోజు టాప్​ న్యూస్​

ఎన్నికల దిశగా రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్​

తెలంగాణ ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల బడ్డెట్​ను ప్రవేశపెట్టింది. నిరుడు రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టిన ప్రభుత్వం.. ఈ ఏడాది మరో రూ.34 వేల కోట్ల మేరకు బడ్జెట్​ సైజ్​ను పెంచింది. దళితబంధు, రైతుబంధు, ఆసరా, కళ్యాణ లక్ష్మి.. లాంటి సంక్షేమం, వ్యక్తిగత లబ్ధి పథకాలకే ఎక్కువ నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చినప్పటికీ గిరిజన బంధు బడ్జెట్​లో కనిపించ లేదు. ఖాళీ జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇచ్చే స్కీమ్​కు నిధులు కేటాయించింది. ఎన్నికల బడ్జెట్ కావటంతో రూ. 10 వేల కోట్లు సీఎం స్పెషల్​ ఫండ్​గా కేసీఆర్​ తన దగ్గరే పెట్టుకున్నారు. మంత్రి హరీశ్‌ రావు అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఫామ్​ హౌజ్​ కేసు సీబీఐకి ​ బదిలీ

ఫాం హౌస్ కేసులో తెలంగాణ సర్కారుకు షాక్​ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసును సీబీఐకు అప్పగించొద్దంటూ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లను న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పును తప్పుబట్టలేమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉందని, 15 రోజుల పాటు తీర్పును అమలు చేయకుండా చూడాలని ఏజీ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే ఊరుకోం: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి హెచ్చరించారు. శ్రీరాంసాగర్​ బ్యాక్​ వాటర్​ తెలంగాణ హక్కు అని అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్​ సభలో సీఎం కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్​ వద్ద జీవన్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ హక్కులను బీఆర్ఎస్​ అమ్మకానికి పెడుతోందని ఫైర్​ అయ్యారు. ఏడు మండలాలు, సీలేరు హైడ్రో ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్​ కు సరేండర్ అయ్యారని విమర్శించారు. బడ్జెట్​లో  నిరుద్యోగ భృతి,  గిరిజన బంధు ఏమైందని ప్రశ్నించారు.

ఇది జీరో బడ్జెట్​ : రేవంత్​రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జీరో బడ్జెట్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ములుగు సమ్మక సారలమ్మ గద్దెలను దర్శించుకొని జోడో యాత్ర ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ వచ్చాక బడ్జెట్‌ కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదన్నారు. నిరుడు దళిత బంధుకు రూ.15 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తే పైసా ఖర్చు చేయలేదని చెప్పారు. పనులకు, కేటాయింపులకు, ఖర్చులకు 30 శాతం పైగా తేడా ఉంటుందని విమర్శించారు.

రాష్ట్రం సంక్షోభంలో ఉంది: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. కేంద్రాన్ని విమర్శించకుంటే కల్వకుంట్ల కుటుంబానికి పూటగడవదని మండిపడ్డారు. కేంద్రంపై బురద జల్లుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, దళిత బంధు, డబల్ బెడ్ రూం అటకెక్కాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతి పాలన చేస్తున్నారని విమర్శించారు. ఈ బడ్జెట్లో సాహిత్యం ఎక్కువైంది, సమాచారం తక్కువైందన్నారు. మోడీ వేసుకునే బట్టల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 

బడ్జెట్​ అంతా డొల్ల : బండి సంజయ్​

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల, ఎలక్షన్‌ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ విమర్శించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదని సంజయ్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో అంశాలు.. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు మొండి చేయి చూపించారని అన్నారు. 50 శాతం బడ్జెట్​ నిధులను ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వం తీరు.. ‘మాటలు కోటలు దాటుతున్నయ్.. చేతలు గడప దాటడం లేదు’అనే సామెతకు అద్దం పడుతోందన్నారు.

టర్కీ సిరియాలో భారీ భూకంపాలు.. 2600 మంది మృతి

టర్కీ, సిరియాలో ఒకేరోజు మూడు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ విపత్తులో దాదాపు 2600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 6వేల మందికిపైగా గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇంకెంతో మంది భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూకంపాలు సంభవించాయి. భవనాలన్నీ పేకమేడల్లా కుప్పకూలాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc