కాబోయే ప్రధాని ఛాన్స్​ ఆమెకే.. టర్కీలో నిజాం నవాబు మరణం.. బయల్దేరిన వందేభారత్ రైలు.. ఈ నెలలోనే టీచర్ల బదిలీలు.. కొత్త సెక్రెటేరియట్​ ప్రారంభం వచ్చే నెలలో

మరణించిన ముకరం ఝా నిజాం

హైదరాబాద్ సంస్థానం  ఆఖరి నిజాం.. ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’  మనుమడు ముకర్రమ్ ఝా మరణించారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయాలనేది బహదూర్ చివరి  కోరిక కావడంతో భౌతికకాయాన్ని టర్కీ నుంచి హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. 17వ తేదీన ఆయన పార్ధీవ దేహం హైదరాబాద్​కు చేరుకుంటుంది. ప్రజల సందర్శనార్ధం చౌమహల్లా ప్యాలెస్లో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ముఖరంజా మరణం పట్ల సీఎం కేసీఆర్​ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ముకర్రమ్ ఝా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. 

వందేభారత్​ ప్రారంభించిన ప్రధాని మోడీ

సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ప్రారంభమైంది. ప్రధాని మోడీ  వర్చువల్గా  హాజరై ప్రారంభించారు. గవర్నర్ తమిళిసై,  కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహుమూద్ అలీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ పండుగ కానుక అని మోడీ అన్నారు.

కేసీఆర్​ బర్త్​డే రోజున.. కొత్త సెక్రెటేరియట్​ ప్రారంభం

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. అదే రోజున కొత్త సెక్రటేరియట్ ను ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాకపోవటంతో..  ఫిబ్రవరి 17న లాంఛనప్రాయంగా  సీఎం, సీఎస్ ఛాంబర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొత్త సెక్రటేరియట్ కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

టీచర్ల బదిలీలు.. ప్రమోషన్లు ఈ నెలలోనే

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదరక్శంగా నెల రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లలోనూ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సంక్రాంతి రోజున ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అనంతరం మంత్రులు హరీష్​రావు, సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రకటన చేశారు. లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ  పోస్టులను ప్రస్తుతం  కామన్ సీనియారిటీ (960 ఖాళీలను అందరితో) భర్తీ చేస్తామని, కోర్టు తీర్పు అనంతరం అప్గ్రేడేషన్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు చేపట్టే బదిలీలు, ప్రమోషన్లన్నీ చివరి వర్కింగ్ డే నుంచి అమలవుతాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ కు, మంత్రులకు ధన్యవాదాలు తెలిపాయి.

నేపాల్​లో ఘోర విమాన ప్రమాదం

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండు నుంచి పోఖారాకు వస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ విమానంలో మొత్తం 72 మంది ఉన్నారు. నేపాల్ మీడియా వార్తల ప్రకారం ఈ ప్రమాదంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.  యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి పోఖారా వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం ఖాట్మాండు నుంచి పోఖారా చేరుకునేందుకు 25 నిమిషాలు పడుతుంది. అయిదు నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవాల్సి ఉండగా.. ఈ ప్రమాదం జరిగింది.

మిస్​ యూనివర్స్​ బొన్ని గాబ్రియేల్​

మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని ఈ సారి అమెరికా దక్కించుకుంది. యూఎస్ కు చెందిన బొన్ని గాబ్రియేల్ ఈసారి విజేతగా నిలిచింది. గ్రాండ్ ఫినాలేలో విజయం సాధించిన బొన్ని.. డైమండ్స్, క్రిస్టల్స్ పొదిగిన గౌన్ లో జిగేల్ మంది. వెనుజులా సుందరి అమండా దుడామెల్ మొదటి రన్నరప్ గా నిలిచింది. అమెరికా లూసియానాలో జరిగిన ఈ పోటీల్లో 2021 మిస్ యూనివర్స్ భారత్ కు చెందిన హర్నాజ్ సంధు, బొన్ని గాబ్రియేల్ కు విశ్వ సుందరి కిరీటాన్ని తొడిగింది. ఇప్పటివరకు మూడు సార్లు భారత్​కు ఈ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు విశ్వసుందరి కిరీటం అందుకున్నారు.

బాలింతల ఘటనపై గవర్నర్​ సీరియస్​

మలక్పేట ఆస్పత్రి ఘటనపై గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. గైనకాలజిస్ట్గా తనకు ఎన్నో సందేహాలు ఉన్నాయని అన్నారు. జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులను మరింతగా మెరుగుపరచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. 

కాబోయే ప్రధాని ఎవరు.. అమర్త్యసేన్​

2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్​ అవార్డు గ్రహీత అమర్త్యసేన్​ అన్నారు. బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఫలితాలు వస్తాయనుకుంటే పొరపాటేనని అభిప్రాయపడ్డారు. దేశానికి తర్వాతి ప్రధాని అయ్యే సామర్థ్యం బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఉందని, అయితే బీజేపీ వ్యతిరేక శక్తులను ఆమె ఏకం చేయగలరా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. డీఎంకే, టీఎంసీ, ఎస్పీ.. తదితర ప్రాంతీయ పార్టీ లు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతాయని అనుకుంటున్నట్లు చెప్పారు.

టీమిండియా గ్రాండ్​ విక్టరీ.. కొహ్లీ విశ్వరూపం

టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఇండియా 317 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడిచింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ వ‌న్డే చరిత్ర‌లో అతి పెద్ద విజ‌యం న‌మోదు చేసింది. 2008లో న్యూజిలాండ్‌పై 290 ప‌రుగుల తేడాతో గెలిచిన రికార్డును అధిగమించింది. శుభ్ మన్ గిల్ వన్డే క్రికేట్​లో రెండో సెంచరీ సాధించగా, వన్డేల్లో విరాట్ కోహ్లీ 46వ సెంచరీ నమోదు చేశారు. 166 పరుగులతో విశ్వరూపం ప్రదర్శించాడు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc